భారత్-శ్రీలంక జట్ల మధ్య జరగనున్న టీ20, వన్డే సిరీస్ షెడ్యూల్ విడుదలైంది. టీ20, వన్డే సిరీస్‌ల షెడ్యూల్‌ను బీసీసీఐ గురువారం ప్రకటించింది. ఈ సిరీస్ జూలై 26 నుంచి ప్రారంభం కానుంది. తొలి టీ20 జూలై 26న పల్లెకెలెలో జరగనుంది. టీ20 సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లు ఈ మైదానంలో జరుగనున్నాయి. శ్రీలంక పర్యటనలో భారత్ మూడు టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. ఈ పర్యటనతో భారత జట్టు ప్రధాన కోచ్‌గా నియమితులైన గౌతమ్ గంభీర్ తన ప్రస్థానాన్ని ప్రారంభించనున్నారు.
Read Also: Telangana Crime: గుట్టురట్టు చేసిన మరణ వాంగ్మూలం.. పరువుకోసం వేధింపులు దాచి..
ఆగస్టు 1 నుంచి కొలంబో వేదికగా వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం జింబాబ్వేలో భారత్ ద్వైపాక్షిక సిరీస్ ఆడుతోంది. జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో ఆడే ఆటగాళ్లలో ఎక్కువ మంది శ్రీలంక టూర్‌లో ఉంటారని భావిస్తున్నారు. జూలై 26న శ్రీలంకతో తొలి టీ20, జూలై 27న రెండో టీ20, జూలై 29న మూడో టీ20 జరగనుంది. వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్ ఆగస్టు 1న జరగనుంది. రెండో మ్యాచ్ ఆగస్టు 4న, చివరి వన్డే ఆగస్టు 7న జరగనుంది. టీ20 సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లు పల్లెకెలెలో జరగనుండగా, వన్డే సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లు కొలంబోలో జరుగుతాయి.
Read Also: CM Revanth Reddy: ఆదాయం తెచ్చిపెట్టే వనరులపై నిక్కచ్చిగా ఉండాలి..
శ్రీలంక పర్యటన షెడ్యూల్
26 జూలై 2024, 1వ టీ20, పల్లెకెలె
27 జూలై 2024, 2వ టీ20, పల్లెకెలె
29 జూలై 2024, 3వ టీ20, పల్లెకెలె
ఆగస్టు 1, 2024, 1వ వన్డే, కొలంబో
4 ఆగస్టు 2024, కొలంబో
4 ఆగస్టు 2020, 27 వన్డేలు3వ వన్డే, కొలంబో
🚨 NEWS 🚨
Fixtures for the upcoming India tour of Sri Lanka announced! 📢#TeamIndia | #SLvIND pic.twitter.com/oBCZn0PlmK
— BCCI (@BCCI) July 11, 2024