సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. జనవరి 1 నుంచి 31 వరకు ఈ రైళ్లు నడుస్తాయని తెలిపారు. ప్రత్యేక రైళ్లలో ముందస్తు రిజర్వేషన్ సదుపాయం కల్పిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. మచిలీపట్నం-కర్నూలు, నర్సాపూర్-సికింద్రాబాద్, సికింద్రాబాద్-విజయవాడ, మచిలీపట్నం-సికింద్రాబాద్, తిరుపతి-అకోలా, పూర్ణ-తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు నడుస్తాయని అధికారులు వివరించారు.
ప్రత్యేక రైళ్ల వివరాలు:
