సంయుక్త మీనన్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఈ మధ్య ఇండస్ట్రీకి పరిచయమై అతి తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్ ను అందుకున్న హీరోయిన్లలో ఈ అమ్మడు కూడా ఒకటి.. ఇటీవల విడుదలై భారీ విజయాన్ని అందుకున్న విరుపాక్ష సినిమాలో నటించింది.. ఈమె చేసిన సినిమాలు అన్నీ కూడా హిట్ అవ్వడంతో నిర్మాతలు క్యూ కడుతున్నారు..
తెలుగుతో పాటు తమిళ్ చిత్రాల్లో కూడా నటిస్తున్నట్లు సమాచారం.. కేరీర్ పరంగా వరుస సక్సెస్ లను అందుకుంటుంది.. అయితే క్రేజ్ పెరిగే కొద్దీ హీరోయిన్ పై రూమర్స్ కూడా పెరుగుతుంటాయని అందరూ అంటూ ఉంటారు.అలాగే సంయుక్త మీనన్ పై కూడా రీసెంట్ ఒక క్రేజీ రూమర్ సోషల్ మీడియా లో ప్రచారం అవుతూ ఉంది.. మొన్నటివరకు త్రివిక్రమ్ తో రిలేషన్ లో ఉందని వార్తలు వినిపించాయి.. ఇప్పుడు మరో వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది..
ఇటీవల భార్యతో విడాకులు తీసుకున్న తమిళ హీరో తో ప్రేమాయణం నడుపుతుందని , ప్రస్తుతం ఆయనతో డేటింగ్ చేస్తున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.. వీరిద్దరూ కలిసి సినిమాలో నటించినట్లు సమాచారం…. ఆ సినిమా కూడా ఘన విజయాన్ని అందుకుందట..ఈ సినిమా తోనే వీళ్లిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని అంటున్నారు.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.. ఇందులో నిజమేంత ఉందో తెలియాలంటే సంయుక్త మీనన్ క్లారిటి ఇచ్చేవరకు వెయిట్ చెయ్యాల్సిందే.. ప్రస్తుతం ఈ అమ్మడు వరుస సినిమాలతో బిజీగా ఉంది..