నేటి నుంచి శమరిమల అయ్యప్ప ఆలయంలోకి భక్తుల దర్శనానికి అధికారులు అనుమతి ఇచ్చారు. రోజుకు 30 వేల మంది భక్తులను అనుమతించనున్నారు. ఇక అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా టీకా సర్టిఫికెట్ లేదా ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్ట్ తప్పనిసరిగా వెంట తీసుకురావాలి. డిసెంబర్ 26వ తేదీతో అయ్యప్ప మండల పూజ ముగియనున్నది. మండల పూజ అనంతరం మకరజ్యోతి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో శబరిమల వస్తుంటారు. మకరజ్యోతి పూర్తైన తరువాత జరవరి 20 వ తేదీన ఆలయాన్ని మూసివేస్తామని అధికారులు తెలియజేశారు. కరోనా కారణంగా నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని అధికారులు తెలిపారు.
Read: ఏపీలో ప్రారంభమైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్…