ఏపీలో ప్రారంభ‌మైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక‌ల పోలింగ్‌…

ఏపీలో 10 జెడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాల‌కు పోలింగ్ ప్రారంభం అయింది.  ఉద‌యం 7 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ జ‌ర‌గ‌నున్న‌ది.  మొత్తం 8 ల‌క్ష‌ల మంది ఓట‌ర్లు త‌మ ఓటుహ‌క్కును వినియోగించుకోబోతున్నారు.  కాగా, గ‌తంలో వివిధ కార‌ణాల‌తో ఎన్నిక‌లు నిలిచిపోయిన స్థానాల్లో ఇప్పుడు పోలింగ్ నిర్వ‌హిస్తున్నారు.  ఈ ఎన్నిక‌ల పోలింగ్ కోసం 954 కేంద్రాలను ఏర్పాటు చేశారు.  

Read: యూపీ పూర్వాంచ‌ల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ల్యాండింగ్ కానున్న ప్ర‌ధాని విమానం…

10 జెడ్పీటీసీ స్థానాల్లో 40 అభ్య‌ర్థులు పోటీ ప‌డుతుండ‌గా, 123 ఎంపీటీసీ స్థానాల్లో 328 మంది అభ్య‌ర్థులు బ‌రిలో ఉన్నారు.  ఈనెల 18 వ తేదీన ఓట్ల లెక్కింపు జ‌రుగుతుంది.  గుంటూరు జిల్లాలో 1 జెడ్పీటీసీ, 11 ఎంపీటీసీ స్థానాల‌కు పోలింగ్ జరుగుతుండ‌గా, అనంత‌పురంలో 1 జెడ్పీటీసీ, 10 ఎంపీటీసీ స్థానాల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హిస్తున్నారు.  తూర్పుగోదావ‌రి జిల్లాలో 21 ఎంపీటీసీ స్థానాల‌కు, విశాఖ జిల్లాలో 1 జెడ్పీటీసీ, 6 ఎంపీటీసీ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి.  

Related Articles

Latest Articles