NTV Telugu Site icon

Naatu Naatu Song: పెళ్లిలో షారూఖ్ దంపతులు ఏం చేశారంటే..

Rukh Khan And Gauri 11

Rukh Khan And Gauri 11

ఆర్ఆర్ఆర్ మూవీలో నాటు నాటు పాటు ఆస్కార్ ఆవార్డు వచ్చిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తగా నాటు నాటు పాటు, డ్యాన్స్ స్టెప్ తేగ వైరల్ అయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏ ఫంక్షన్ జరిగినా నాటు నాటు పాట ఉండాల్సిందే. అయితే, సెలబ్రిటీలు ఆపాటు డ్యాన్స్ చేస్తే ? ఎలా ఉంటుంది. సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. తాజాగా ఇప్పుడు అదే జరిగింది. ప్రముఖ ఫిట్‌నెస్ నిపుణురాలు, రచయిత డీన్నే పాండే, చిక్కి పాండే (నటుడు చుంకీ పాండే సోదరుడు)ల కుమార్తె అలన్నా పాండే.. తన చిరకాల ప్రియుడు ఐవోర్ మెక్‌క్రేను పెళ్లి చేసుకుంది. ముంబైలో కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లిలో బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్, ఆయన భార్య గౌరీ సందడి చేశారు.
Also Read:PM Modi: వేసవిలో ప్రధాని మోదీకి జో బైడెన్ ప్రత్యేక ఆతిథ్యం!

పెళ్లి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అలన్నా పాండే భర్త ఐవోర్ మెక్‌క్రే ఆస్కార్ విన్నింగ్ పాట నాటు నాటుకు డ్యాన్స్ చేశాడు. అయితే, ఈ పాటుకు డ్యాన్స్ చేస్తున్న సందర్భంగా షారుఖ్ ఖాన్, ఆయన భార్య గౌరీ వరుడిని ఉత్సాహపరుస్తూ, చప్పట్లు కొట్టారు. వరుడు ఐవోర్ కోసం ఉత్సాహంగా ఉన్న జంట జోష్ నింపారు. పెళ్లిలో అలన్నా కజిన్ అయిన హీరోయిన్ అనన్య పాండే కూడా డ్యాన్స్ చేసింది. ఆమె తన తండ్రి చుంకీ పాండే, కజిన్ అహాన్ పాండేతో కలిసి సాత్ సముందర్ పార్కు నృత్యం చేసింది. ఈ పెళ్లికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read:Tooth Decay : దంతాలు పుచ్చి పోతున్నాయా.. వీటిని ట్రై చేయండి..

అలన్నా పాండే, ఐవోర్ మెక్‌క్రే ఎట్టకేలకు గురువారం ముంబైలో గ్రాండ్ వెడ్డింగ్ వేడుకలో పెళ్లి చేసుకున్నారు. అనన్య పాండే, చుంకీ పాండే, భావనా పాండే, జాకీ ష్రాఫ్, అల్విరా ఖాన్ అగ్నిహోత్రి, ఆమె కుమార్తె అలీజ్ సహా బాలీవుడ్ ప్రముఖులు అనేక మంది అలన్నా, ఐవర్ల వివాహానికి వచ్చారు. కనికా కపూర్ కూడా వివాహానికి హాజరయ్యారు. వివాహ రిసెప్షన్‌లో షారుఖ్ ఖాన్, జుహీ చావ్లా నటించిన ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీలోని ‘ఐ యామ్ ది బెస్ట్’ పాటకు అహాన్ పాండే, కరణ్ మెహతా ప్రదర్శన ఇచ్చారు. షారుఖ్, గౌరీ పక్కన నుండి నృత్యాన్ని ఆస్వాదించారు. షారుఖ్ ఖాన్ తెల్లటి చొక్కా ధరించి, బ్లాక్ బ్లేజర్, మ్యాచింగ్ ఫార్మల్ ప్యాంట్‌తో కనిపించాడు. వరుడు నాటు నాటుకు డ్యాన్స్ చేస్తుంటే. షారూఖ్ ఖాన్ దంపతులు ప్రదర్శనను ఆస్వాదించారు.

Show comments