మ‌న‌ల్ని వేధించే దంత సంబంధిత స‌మ‌స్యల్లో పిప్పి ప‌న్ను స‌మ‌స్య కూడా ఒక‌టి. ప్రస్తుత కాలంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు.

పూర్వకాలంలో వందేళ్లు వ‌చ్చినా కూడా దంతాలు ఆరోగ్యంగా ఉండేవి. కానీ నేటి త‌రుణంలో పిల్లల్లో కూడా మ‌నం దంతాలు పుచ్చిపోవ‌డాన్ని మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. 

నోటిలో ఉండే క్రిముల‌ను చంపి దంతాలు పుచ్చిపోకుండా ఉండాల‌ని మ‌నం మార్కెట్ లో దొరికే ర‌క‌ర‌కాల టూత్ పేస్ట్ ల‌ను వాడుతూ ఉంటాం. ఎన్ని ర‌కాల టూత్ పేస్ట్ లు వాడిన‌ప్పటికి దంతాలు పుచ్చిపోతూనే ఉంటాయి.

అలాగే చాలా మంది రోజుకు రెండు సార్లు దంతాల‌ను శుభ్రం చేసుకుంటూ ఉంటారు. అయిన‌ప్పటికి దంతాలు పుచ్చిపోతూ ఉంటాయి.

దంతాలు పుచ్చిపోకుండా ఉండాలంటే మ‌న ఆహార‌పు అల‌వాట్లను మార్చుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు. 

పంచ‌దారతో చేసిన తీపి ప‌దార్థాలు, చాక్లెట్లు, మైదా పిండితో చేసిన ప‌దార్థాలు, శీత‌ల పానీయాలు, టీ, కాఫీల‌ వంటి వాటికి దూరంగా ఉండాలి. 

ఇటువంటి ప‌దార్థాలు తిన్నప్పటికి దంత క్షయం కాకుండా ఉండాలంటే రాత్రి భోజ‌నం చేసిన త‌రువాత చెరుకు ముక్కల‌ను బాగా న‌మ‌లాల‌ని నిపుణులు చెబుతున్నారు. 

దంత‌క్షయానికి కార‌ణ‌మ‌య్యే చెడు బ్యాక్టీరియాల‌ను న‌శింప‌జేసే యాంటీ ఆక్సిడెంట్లు చెరుకులో అధికంగా ఉంటాయి. 

అలాగే మొల‌కెత్తిన గింజ‌ల‌ను, దానిమ్మ గింజ‌ల‌ను, తాజా పండ్లు, కొబ్బ‌రి, ఉడికించ‌ని స్వీట్ కార్న్ గింజ‌ల‌ను, నారింజ తొన‌ల‌ను న‌మిలి తినాలి. దంతాలకు గార‌ప‌ట్టకుండా ఉంటుంది. 

మొల‌కెత్తిన గింజ‌ల‌ను తిన‌డం వ‌ల్ల వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల కార‌ణంగా నోట్లో ఉండే బ్యాక్టీరియాలు న‌శిస్తాయి.

దంతాలు పుచ్చిన త‌రువాత బాధ‌ప‌డ‌డం కంటే వాటిని జాగ్ర‌త్త‌గా కాపాడుకోవ‌డ‌మే మంచిద‌ని వారు సూచిస్తున్నారు.