తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తనదైన మార్క్ చూపిస్తున్నారు స్టాలిన్.. కొన్ని సందర్భాల్లో అందరినీ ఆయన నిర్ణయాలు ఆశ్చర్యంలో ముంచేసిన సందర్భాలు లేకపోలేదు.. ఇక, ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు స్టాలిన్… రాష్ట్రంలో కరోనాతో చనిపోయినవారికి సహాయం అందించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకోగా.. ఇవాళ దానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు.. కరోనాబారినపడి చనిపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి 50 వేల రూపాయలు ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.. కాగా, ఇప్పటి వరకు తమిళనాడులో కరోనాతో 2,800 మందికి పైగా మృతిచెందినట్టు గణాంకాలు చెబుతున్నాయి.
Read Also: కేబినెట్ భారీ ప్రక్షాళన.. ఏకంగా 10 మంది మంత్రులు ఔట్..?
రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి నుండి ఈ సహాయాన్ని అందించనున్నారు.. సెప్టెంబర్ 3, 2021న ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మరియు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సంయుక్తంగా జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. కరోనాతో మృతిచెందినట్టు ధృవీకరించబడినవారికే ఈ పరిహారం అందనుంది. ఇక, ఈ ఎక్స్‌గ్రేషియా సహాయం.. భారత్‌లో కరోనా మొదటి కేసు నమోదైనప్పటి నుంచి వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది తమిళనాడు ప్రభుత్వం.
