Site icon NTV Telugu

రాజకీయాల్లో మాటల మాంత్రికుడు రోశయ్య… సింగిల్ డైలాగ్‌తో నోళ్లు మూయించేవారు

సినిమాల్లో మాటల మాంత్రికుడు అనగానే అందరికీ త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు ఎలా గుర్తుకువస్తుందో.. రాజకీయాల్లో మాటల మాంత్రికుడు అంటే రోశయ్య పేరు గుర్తుకురాక మానదు. ఎందుకంటే ఆయన చెప్పే సింగిల్ డైలాగ్‌లో ఎన్నో సమాధానాలు ఉంటాయి. ఆయన మాటలు పరుషంగా లేకపోయినా చాలా అర్థవంతంగా ఉంటాయి. ఎవరైనా రోశయ్యపై ఆరోపణలు చేస్తే.. రోశయ్య సింగిల్ డైలాగుతో సమాధానం చెప్పేస్తారు. దీంతో బడా రాజకీయ నేతలు కూడా ఏం మాట్లాడలేని పరిస్థితులు గతంలో ఎన్నో చోటుచేసుకున్నాయి. అందుకే ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు సీఎం అయినా మంత్రిగా రోశయ్య ఉండాల్సిందే.

Read Also: అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రోశయ్య

వైఎస్ఆర్‌ సీఎంగా ఉన్న సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు… అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి రోశయ్యను ఉద్దేశించి మీకు ఈ మధ్య తెలివితేటలు ఎక్కువ అయ్యాయి అంటూ వ్యాఖ్యానించారు. అయితే చంద్రబాబు విమర్శకు ప్రతిస్పందించిన రోశయ్య… తనకే తెలివితేటలు ఉంటే చెన్నారెడ్డిని, నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డిని, అంజయ్యను, వీరితో పాటు తనను నమ్మిన వైఎస్‌ఆర్‌ను దించి ఎప్పుడో సీఎం అయ్యే వాడిని అంటూ సెటైర్ వేశారు. ఇందులో చాలా అర్ధాలను మనం విశ్లేషించవచ్చు. ఎందుకంటే ఎన్టీఆర్‌ను సీఎం సీటులో నుంచి దించి చంద్రబాబు సీఎం అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ విషయాన్ని పరోక్షంగా అసెంబ్లీలో రోశయ్య తన డైలాగ్ ద్వారా ప్రస్తావించారు. అంతేకాదు రోశయ్య సీఎంగా ఉన్న సందర్భంలోనూ ప్రతిపక్షాలు… ‘మీరు మందబలంతో బిల్లులు పాస్ చేయించుకుంటున్నారు’ అని ఆరోపణలు చేయగా… రోశయ్య ‘అవును.. మాకు మందబలం ఉంది కాబట్టే అధికారంలో ఉన్నాం’ అంటూ సింగిల్ పంచ్‌తో ప్రతిపక్షాల నోళ్లు మూయించారు.

https://www.youtube.com/watch?v=8QmpiSGFOpU
Exit mobile version