Site icon NTV Telugu

కోహ్లీ కెప్టెన్సీ పై రోహిత్ వ్యాఖ్యలు…

కొత్తగా భారత జట్టు వన్డే కెప్టెన్సీ బాధ్యతలను అందుకున్న రోహిత్ శర్మ.. ఇంతకముందు ఈ బాధ్యతలను నిర్వర్తించిన విరాట్ కోహ్లీని ప్రశంసించాడు. 2017లో ధోని నుండి పరిమిత ఓవర్ల కెప్టెన్సీ బాధ్యతలను అందుకున్న విరాట్ కోహ్లీ ఈ మధ్య టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకోగా… బీసీసీఐ వన్డే కెప్టెన్ గా తప్పించింది. కానీ జట్టు కోహ్లీ కెప్టెన్సీ కింద చాలా అద్భుతమైన సమయాన్ని గడిపింది. నేను అతనితో చాలా రోజులుగా ఆడుతున్నాను. అందులో ప్రతి క్షణాన్ని నేను మర్చిపోలేను.

అయితే కెప్టెన్ గా కోహ్లీ జట్టును చాలా ఎత్తులో ఉంచాడు. ఎప్పుడు జట్టుకు వెనక్కి తిరిగి చూసుకోవలసిన పరిస్థితి లేకుండా చేసాడు. ప్రతి గేమ్ గెలవాలనే పట్టుదలను జట్టులో పెంచాడు. అలాగే గ్రౌండ్ లో కొహ్లీ జట్టును ఎప్పుడు ముందుడి నడిపిస్తాడు. నేను అతనితో ఇంకా ముందు ముందు ఆడటం కోసం ఎదురు చూస్తున్నాను అని రోహిత్ పేర్కొన్నాడు.

Exit mobile version