NTV Telugu Site icon

ఓ ఇంటివాడైన తేజస్వి యాదవ్.. బాల్య స్నేహితురాలితో పెళ్లి

ఆర్జేడీ అధినేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమారుడు, ఆర్జేడీ కీలక నేత తేజస్వి యాదవ్‌ ఓ ఇంటివాడయ్యాడు… ఇవాళ తన బాల్య స్నేహితురాలిని వివాహం చేసుకున్నారు తేజస్వి యాదవ్.. ఢిల్లీలో తేజస్వి యాదవ్-రాచెల్ వివాహ వేడుక ఘనంగా జరిగింది… ఢిల్లీలోని తేజస్వి సోదరి మిసా భారతి ఫామ్‌హౌస్‌లో ఈ వేడుక నిర్వహించారు.. కరోనా నేపథ్యంలో.. ఈ వేడకకు కుటుంబసభ్యులు, సన్నిహితులకు మాత్రమే ఆహ్వానాలు పంపారు.. ఇక, ఈ వివాహ వేడుకకు యూపీ మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌, ఆయన భార్య డింపుల్‌, రాజ్యసభ ఎంపీ మీసా భారతి, ఇతర కొంతమంది నాయకులు కూడా హాజరయ్యారు..

Read Also: ప్రధాని మోడీతో విజయసాయిరెడ్డి భేటీ.. వీటిపై చర్చ

కాగా, బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా పనిచేశారు తేజస్వి యాదవ్… మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ చిన్న కుమారుడైన తేజస్వి యాదవ్.. హర్యానాకు చెందిన రాచెల్‌ని వివాహం చేసుకున్నారు.. పాఠశాలలో చదువుకునే రోజుల నుంచే ఇద్దరికీ పరిచయం ఉంది.. ఇక, వీరి వివాహం సందర్భంగా గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. అనేక మంది బౌన్సర్లు ఫామ్ హౌస్ వెలుపల నిలబడి కనిపించారు.. ప్రధాన గేటులోకి అనుమతించే ముందు అన్ని వాహనాల వివరాలను తనిఖీ చేసిన తర్వాతే పంపించారు. ఈ వివాహానికి సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ఇప్పుడు వైరల్‌గా మారిపోయాయి. మరోవైపు వీరి నిశ్చితార్థం.. పెళ్లికి ఒకరోజు ముందు జరిగినట్లు తెలుస్తోంది.. లాలూ ప్రసాద్‌ యాదవ్‌కి ఏడుగురు సంతానం ఉండగా.. తేజస్వి చిన్నవాడు.. ప్రస్తుతం బీహార్ శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. గతంలో రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు.