Site icon NTV Telugu

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి

తెలంగాణ పీసీసీ చీఫ్ ప‌ద‌వికి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయ‌డంతో.. ‌తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ నియామక ప్రక్రియపై పంచాయతీ మొదలైంది. పదవి నాకు కావాలి.. అంటే నాకు అంటూ పోటీ పడ్డారు నేతలు. ఎవరికి వారు… తమ పంతాన్ని నెగ్గించుకునే పనిలో పడ్డారు. అయితే తెలంగాణ పీసీసీ చీఫ్ పై క‌స‌ర‌త్తు ప్రారంభించిన కాంగ్రెస్ అధిష్టానం.. ఓ నిర్ణ‌యానికి వ‌చ్చి తాజాగా పీసీసీ అలాగే ఇత‌ర క‌మిటీల‌ను ప్రకటించింది. తెలంగాణ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్‌ రెడ్డిని నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఐదుగురిని కార్యనిర్వాహక అధ్యక్షులుగా, పది మందిని సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌లుగా నియమించింది. వర్కింగ్ కమిటీ ప్రసిడెంట్లుగా జగ్గారెడ్డి, మహేష్ గౌడ్, అంజన్ కుమార్, అజారుద్దీన్, గీతా రెడ్డి లను ఎంపిక చేయగా ప్రచార కమిటీ ఛైర్మన్ గా మధు యాష్కిని నియమించింది.

Exit mobile version