వ్యాపార రంగంలో రిలయన్స్‌కు ఎదురేలేదు.. కొత్త రంగాలకు వ్యాపారాలను విస్తరిస్తూ.. లాభాలను ఆర్జిస్తూనే ఉంది ఆ సంస్థ.. ఇక, గ్రీన్ ఎనర్జీలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది ఆ సంస్థ.. ఇప్పటికే జామ్‌నగర్ దగ్గర గిగా ఫ్యాక్టరీ పనులు కొనసాగిస్తూనే మరోవైపు గ్రీన్ టెక్నాలజీలో వివిధ సంస్థలతో చేతులు కలుపుతోంది.. అందులో భాగంగా.. సోడియం ఐయాన్ బ్యాటరీ టెక్నాలజీలో ప్రపంచంలోనే మంచి పేరు పొందిన ఫారడియన్ కంపెనీని రియలన్స్ కొనేసింది.. ఆ కంపెనీకి సంబంధించిన వంద శాతం వాటాలను తన వశం చేసుకున్నట్టు రిలయన్స్ వెల్లడించింది..
Read Also: సినీ హీరోలను టార్గెట్ చేసిన టీడీపీ ఎమ్మెల్యే.. రియల్ హీరోలుగా మారరా..?
కాగా, యూకేలోని ఆక్స్‌ఫర్డ్, షేక్‌ఫీల్డ్ బేస్‌డ్‌గా వ్యాపారం నిర్వహిస్తున్న ఫారడియన్ కంపెనీ మార్కెట్ వ్యాల్యూ 100 మిలియన్ పౌండ్లుగా ఉండగా.. మరో 25 మిలియన్ పౌండ్లను ఫారడియన్ కంపెనీ విస్తరణ, ఆర్ అండ్ డీ కోసం రిలయన్స్ సంస్థ కేటాయింపులు చేయనుంది… బ్యాటరీ తయారీలో వినియోగించే కోబాల్ట్, కాపర్, లిథియం, కాపర్, గ్రాఫైట్‌లతో పోల్చితే ఈ సోడియం ఉపయోగించడం చాలా తేలికగా జరిగిపోతోంది.. మరోవైపు.. భూమిపై సోడియం నిల్వలకు కూడా కొదవలేదు.. దీంతో.. బ్యాటరీ తయారీ ఖర్చు భారీగా తగ్గుతుందనే అంచనాలున్నాయి.. అంతే కాకుండా సోడియం ఐయాన్ బ్యాటరీలు.. ఇతర బ్యాటరీలతో పోలిస్తే.. చాలా త్వరగా ఛార్జ్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇక, తాజా పరిణామాలపై రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ స్పందిస్తూ.. న్యూ ఎనర్జీకి సంబంధించి మేం నిర్ధేశించుకున్న లక్ష్యాలను చేరడానికి ఫారడియన్ టేకోవర్ ఎంతగానో ఉపకరిస్తుందని పేర్కొన్నారు.