Site icon NTV Telugu

Navjot Sidhu: రాహుల్ గాంధీని కలిసిన నవజ్యోత్ సిద్ధూ.. కాంగ్రెస్ నేత నేతృత్వంలో విప్లవం

Siddu And Rahul

Siddu And Rahul

పాటియాలా కోర్టు నుంచి ఇటీవలే విడుదలైన మాజీ క్రికెటర్, పంజాబ్ కు చెందిన కాంగ్రెస్ నవజ్యోత్ సిద్ధూ రాహుల్ గాంధీని కలిసారు. 10 నెలల తర్వాత జైలు నుంచి విడుదలైన సిద్ధూ ఈరోజు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలను కలిశారు. పంజాబ్ కోసం పని చేయడానికి తన నిబద్ధతను పునరుద్ఘాటించారు. ”నా మెంటర్ రాహుల్, స్నేహితురాలు, గైడ్ ప్రియాంక గారిని కలిశాను. మీరు నన్ను జైలులో పెట్టవచ్చు, నన్ను భయపెట్టవచ్చు, నా ఆర్థిక ఖాతాలన్నింటినీ బ్లాక్ చేయవచ్చు. కానీ పంజాబ్ పట్ల నా నిబద్ధత ఒక్క అంగుళం కూడా వదలదు, వెనక్కి తగ్గదు అని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
Also Read: Quantum EV-scooter: వాణిజ్య డెలివరీల కోసం EV-స్కూటర్‌.. ధర ఎంతో తెలుసా?

34 ఏళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తిని హత్య చేసిన కేసులో నవజ్యోత్ సిద్ధూ పంజాబ్‌లోని పాటియాలాలో 10 నెలల పాటు జైలులో ఉన్నారు.ఈ కేసులో అతనికి ఒక సంవత్సరం శిక్ష పడింది. ఈ ఏడాది మేలో ఆయన జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది. అయితే మంచి ప్రవర్తన కారణంగా రెండు నెలల ముందుగానే విడుదల అయ్యారు. కాగా, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ రాష్ట్ర పీసీసీ చీఫ్ పదవికి ఆయన రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
Also Read:Chennai Airport: చెన్నై విమానాశ్రయంలో కొత్త టెర్మినల్‌.. తమిళ సంస్కృతి ప్రతిబింబించేలా నిర్మాణం

శనివారం విడుదలైనప్పటి నుండి, సిద్ధూ పనిలో మునిగిపోయాడు. ఖలిస్తానీ వేర్పాటువాది అమృతపాల్ సింగ్ మద్దతుదారులపై పోలీసులు అణిచివేత నేపథ్యంలో పంజాబ్‌లో రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పంజాబ్ ఈ దేశానికి రక్షణ కవచం. ఈ దేశంలో నియంతృత్వం వచ్చాక రాహుల్ గాంధీ నేతృత్వంలో విప్లవం కూడా వచ్చిందని సిద్ధూ వ్యాఖ్యానించారు.

Exit mobile version