Quantum EV-scooter: వాణిజ్య డెలివరీల కోసం EV-స్కూటర్.. ధర ఎంతో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎలక్ట్రిక్ బైక్‌లు త్వరగా జనాదరణ పొందుతున్నాయి. ఎలక్ట్రిక్ వాహన శ్రేణిలో వినూత్నమైన మోడళ్లు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరగడంతో గత రెండేళ్లుగా ఎలక్ట్రిక్ బైకులకు డిమాండ్ పెరిగిపోయింది. గతేడాది ఎలక్ట్రిక్ బైకుల అమ్మకాలు రికార్డులు సృష్టించాయి. చాలా వరకు స్ట్రార్టప్ కంపెనీల ఎలక్ట్రానిక్ బైకుల విక్రయాల్లో దూసుకెళ్లాయి.
Also Read:Indians in Foreign Prisons: విదేశీ జైళ్లలో భారతీయులు… ఆ దేశంలోనే అత్యధికం!
తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్ బైకుల కంపెనీ అయిన క్వాంటమ్ ఎనర్జీ సరికొత్త లుక్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. వాణిజ్య డెలివరీల కోసం ఇ-స్కూటర్ అయిన క్వాంటమ్ బిజినెస్ యొక్క కొత్త వేరియంట్‌ను ఆవిష్కరించింది. క్వాంటం బిజినెస్ ధర రూ. 99,000 నుండి ప్రారంభమవుతుందని కంపెనీ తెలిపింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రత్యేకల విషయానికి వస్తే.. ఎలక్ట్రిక్ స్కూటర్ 1200W అధిక పనితీరు గల మోటారుపై ఆధారితమైనది. ఇది గరిష్టంగా 55 kmph వేగాన్ని అందుకోగలదు. కేవలం 8 సెకన్లలో 0 నుండి 40 kmph వరకు సులభంగా వేగాన్ని అందుకుంటుంది.
Also Read: Woman Dances: ఢిల్లీ మెట్రో ప్లాట్‌ఫారమ్‌పై యువతి డ్యాన్స్.. నెటిజన్లు రియాక్షన్ ఇది..
Also Read
- Koti Deepotsavam 2026 Day 3: అంగరంగ వైభవంగా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి కల్యాణం.. మూడో రోజు విశేషాలివే..
- Koti Deepotsavam 2026 Day 2: అంగరంగ వైభవంగా తిరుచెందూరు శ్రీసుబ్రహ్మణ్యస్వామి కల్యాణం.. రెండో రోజు విశేషాలివే..!
- Sun Transit : రేపు సూర్యుడి రాశి మార్పుతో అదృష్టం.. ఈ 8 రాశులకు శుభ ఘడియలు!
- Kondagattu Temple : 60 ఏళ్ల నిరీక్షణకు తెర.. కొండగట్టులో అంజన్న నిజరూప దర్శనం
ఈ స్కూటర్ బహుళ వ్యాపార అనువర్తనాల కోసం ఒకే పూర్తి బ్యాటరీ ఛార్జ్‌పై 130 కి.మీ (డ్రైవింగ్ ప్యాటర్న్‌పై ఆధారపడి) వరకు ప్రయాణించవచ్చు. మరీ ముఖ్యంగా, లాక్-అన్‌లాక్‌తో సహా కొన్ని సెగ్మెంట్-ఉత్తమ లక్షణాలను కలిగి ఉంది. USB ఛార్జర్, డిస్క్ బ్రేకులు, LCD డిస్ప్లే లాంటివి ఉన్నాయి. క్వాంటమ్ ఎనర్జీ లిమిటెడ్ డైరెక్టర్ చేతన చుక్కపల్లి మాట్లాడుతూ, “భారతదేశంలో, ద్విచక్ర వాహనాలను నడిపే వ్యక్తులలో గణనీయమైన భాగం రవాణా కోసం కాకుండా, సరుకులను తీసుకెళ్లడం, రెండు చక్రాలపై వ్యాపారాలు చేయడం చేస్తారు” అని తెలిపారు. అనేక రకాల కస్టమర్లకు అందుబాటులో ఉండేలా తక్కువ ధరకే కొత్త బైక్ ని అందిస్తున్నామన్నారు.
Also Read: Preschool Teacher: పిల్లలతో టీచర్లు ఇలా వ్యవహరిస్తారా?
కొత్త మోడల్లో అప్‌గ్రేడ్ చేయబడిన LFP బ్యాటరీ, శక్తివంతమైన హెడ్‌ల్యాంప్, సౌకర్యవంతమైన రైడ్ల కోసం విస్తృత సీటు, బహుళార్ధసాధక ఉపయోగం కోసం బలమైన కార్గో ర్యాక్, ఎక్కువ లోడ్లను మోయడానికి పెద్ద ఫ్లాట్ ఫుట్‌బోర్డ్, మెరుగైన స్థిరత్వం హ్యాండ్లిన్ కోసం 12 పొడవైన వీల్‌బేస్ ఉన్నాయి. అంతేకాదు అదనంగా కంపెనీ మూడు సంత్సరాలు లేదా 90,000 కిమీ బ్యాటరీ వారంటీని కూడా అందిస్తోంది.
తాజావార్తలు
-
PM Modi in Philippines: మనీలాలో వందేళ్ల చరిత్ర కలిగిన గురుద్వారాను సందర్శించిన మోడీ.. పునరాభివృద్ధి పనులకు శ్రీకారం
-
Mammootty: మీకోసమే ఇక్కడికి వచ్చాను.. తెలుగు ప్రేక్షకులపై మమ్ముట్టి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Janasena vs Janasena: నేను 2 ఎకరాలు ఇస్తా.. 3 ఎకరాలైనా నేను సిద్ధం.. సర్పంచ్ పదవి కోసం జనసేన నేతల మధ్య తీవ్ర పోటీ..!
-
Badrinath Highway Tragedy: బద్రీనాథ్ హైవేపై ఘోర ప్రమాదం.. లోయలో పడిన బస్సు.. ఆరుగురు మృతి!
-
IND vs NZ 1st Test: తొలి టెస్టుకు టీమిండియా ప్లేయింగ్ కాంబినేషన్ ఖరారు.. గిల్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
12.1 అంగుళాల 2.8K డిస్ప్లే, 10,050mAh బ్యాటరీతో OPPO Pad Air6 ట్యాబ్లెట్ లాంచ్..!
-
10 రోజుల బ్యాటరీ లైఫ్, IP69+IP69K రేటింగ్స్, 100+ స్పోర్ట్స్ మోడ్లతో OPPO Watch 5 లాంచ్..!
-
IPL 2027: రాజస్థాన్ రాయల్స్‌లోకి మహమ్మద్ షమీ.. వరల్డ్ కప్ విన్నర్‌ను వదులుకుంటున్న ఆర్ఆర్!
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!