తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి ఓ శుభవార్త. చాలా మంది స్మార్ట్ ఫోన్ల ధరల కారణంగా దానిని వాడడానికి భయపడుతున్నారు. మార్కెట్ లో కొన్ని బ్రాండ్ లకు చెందిన కంపెనీలు అద్భుత ఫీచర్లతో తక్కవ ధరలకే విక్రయిస్తున్నాయి. రూ. 10 వేల బడ్జెట్ లోనే స్మార్ట్ ఫోన్లు లభిస్తున్నాయి. తాజాగా ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ రియల్‌మీ సంస్థ కొత్త మొబైల్ ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. రియల్ మీ సీ 33 పేరుతో రిలీజ్ చేసిన ఫోన్ అన్ని అధునాతన ఫీచర్లతో పాటు 5జీ సపోర్ట్‌తో వినియోగదారులను ఆకర్షిస్తోంది. స్మార్ట్‌ఫోన్ గత సంవత్సరం ప్రారంభించిన Realme C33 యొక్క అప్‌గ్రేడ్ వెర్షన్. ఈ ఫోన్‌లోని 4 జీబీ+64 జీబీ వేరియంట్ ధర రూ.9999 కాగా, 4జీబీ+128 జీబీ వేరియంట్ ధర రూ.10499గా ఉంది. ఫోన్ ఆక్వా బ్లూ, నైట్ సీ, శాండీ గోల్డ్ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ రియల్‌మి ఇండియా వెబ్‌సైట్ ద్వారా విక్రయిస్తున్నారు.
Also Read:liquor case: ఈడీ ముందుకు కవిత.. ఢిల్లీకి క్యూ కట్టిన మంత్రులు.. ఏం జరగబోతోంది?
Realme C33 రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. రెండు వేరియంట్లు 4GB RAMతో వస్తాయి. అయితే, వినియోగదారులు 64GB, 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్ మధ్య ఎంచుకోవడానికి అవకాశం ఉంది. 6.5 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే కలిగి ఉంది. యూనిఎస్ఓసీ టీ612 చిప్‌సెట్ ఎంఏఐ జీ57 జీపీయూ గ్రాఫిక్ కార్డ్ లో ఫోన్ లో ఆకర్షిస్తోంది. 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతో డ్యూయల్ కెమెరా సెన్సార్లు, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. అలాగే, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ర్జింగ్ సపోర్ట్‌తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో లభిస్తోంది. తక్కువ ధరలో కొత్త స్మార్ట్ ఫోన్ కోనుగోలు చేయాలని భావించే వారికి ఈ Realme C33 బెస్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు.
Also Read:AP Budget 2023-2024: నేడే ఏపీ బడ్జెట్.. బుగ్గన పద్దు ఎంతంటే..