స్వర్గీయ నటుడు నందమూరి తారకరామారావు శతజయంతి వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతో ఘనంగా జరిగాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ విజయవాడలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలను చేస్తూ ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను నిర్వహించారు నందమూరి ఫ్యాన్స్, టీడీపీ కార్యకర్తలు.. ఈ కార్యక్రమానికి భారీగా జనాలు కూడా తరలివచ్చారు.
ఈ క్రమంలోనే విజయవాడలో ఎన్టీఆర్ విజ్ఞాన ట్రస్టు, దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఎన్టీఆర్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ ఎన్టీఆర్ శతజయంతి వేడుకలలో భాగంగా తెలుగు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు..ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు..తాను ఎన్టీఆర్ శత జయంతి వేడుకలలో పాల్గొనడానికి రాలేదని ఒక జోక్ చెప్పడానికి వచ్చాను అని చెప్పుకొచ్చారు..ఈ జోక్ వింటే ఎవ్వరికి నవ్వు కూడా రాదని అయితే ఈ జోక్ విన్న తర్వాత స్వర్గంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ గారికి నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాదని ఈయన కామెంట్ చేశారు. చంద్రబాబు క్యారెక్టర్ ఎలాంటిది అనేది ఎన్టీఆర్ ఆనాడే చెప్పారని వర్మ అన్నారు..
ఇకపోతే నందమూరి ఫ్యామిలీ, నారా వారి ఫ్యామిలీ గురించి చెబుతూ విమర్శలు చేశారు.. నందమూరి ఫ్యామిలిలో జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే మగాడు అని ఈయన కామెంట్ చేశారు.వారందరితో కలిసి ఎన్టీఆర్ వేదిక పంచుకోకుండా అక్కడికి వెళ్లకుండా ఉన్నారు అందుకు గల కారణం ఈయన సీనియర్ ఎన్టీఆర్ పై ఉన్న ఒక విపరీతమైన గౌరవంతో ఒక విధానానికి కట్టుబడి ఉన్నారు అంటూ వర్మ ఈ సందర్బంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపడంతో పాటు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.. టీడీపీ తమ్ముళ్లు ఎలా స్పందిస్తారో చూడాలి..