Rajinikanth : తలైవా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..ఒకే సినిమాలో ఇద్దరు సూపర్ స్టార్స్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఈ వయస్సులో కూడా వరుస సినిమాలతో బిజీ షెడ్యూల్ ను గడుపుతున్నారు. ఇక జైలర్ సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు తలైవా రజినీకాంత్..వివిధ భాషల స్టార్స్ జైలర్‌లో కీలక పాత్రల్లో నటించారు. చూడటానికి రెండు కళ్లలు చాలవన్నట్లుగా అనిపించింది అభిమానులకు.. అందుకే ఈ సినిమా తెలుగు, తమిళంతో పాటు పలు భాషల్లోనూ బాగా ఆడింది. జైలర్ అనే కాదు మల్టీస్టారర్ సినిమాలకు ఎప్పుడూ మంచి గిరాకే ఉంటుంది.
ఇదిలా ఉండగా.. ఇద్దరు లెజెండరీ నటుల కాంబినేషన్‌లో త్వరలోనే ఓ సినిమా తెరకెక్కనుంది. అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ కాంబినేషన్‌లో మూవీ రూపొందనుంది. తలైవా 170వ సినిమాలో బిగ్‌బీ నటించనున్నారని సమాచారం.. ఈ విషయాన్ని రజనీకాంత్ స్వయంగా వెల్లడించాడు. 33 ఏళ్ల తర్వాత తన గురువు బిగ్‌బీతో కలిసి నటించబోతున్నట్లు పేర్కొన్నాడు. తనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందని ట్విటర్‌లో రాసుకొచ్చాడు..
Also Read
జైలర్ తర్వాత రజినీకాంత్ జై భీమ్ ఫేమ్ టీజీ జ్ఞానవేల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇందులో ఫహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్, దసరా విజయన్, రక్షన్ తదితరులు నటించనున్నట్లు తెలుస్తోంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మితం కానున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నాడు. ఇకపోతే బిగ్‌బీ, తలైవా చివరగా 1991లో వచ్చిన హమ్ సినిమాలో కనిపించారు.. మళ్లీ ఇప్పుడు నటించడం తో తలైవా ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.. రజినీకాంత్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
After 33 years, I am working again with my mentor, the phenomenon, Shri Amitabh Bachchan in the upcoming Lyca’s “Thalaivar 170” directed by T.J Gnanavel. My heart is thumping with joy!@SrBachchan @LycaProductions @tjgnan#Thalaivar170 pic.twitter.com/RwzI7NXK4y
— Rajinikanth (@rajinikanth) October 25, 2023
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!