Site icon NTV Telugu

చిక్కుల్లో సూపర్ స్టార్ అభిమానులు

Annaatthe first look poster on Vinayaka Chaturthi?

ఇప్పుడు అభిమానం కొత్త చిక్కులు తెచ్చి పెడుతోంది. ఇంతకుముందు అభిమానం పేరుతో ఫ్యాన్స్ కొట్టుకున్నారు, చంపుకున్నారు. ఆ పరిస్థితి మారడానికి, ఒక హీరో అభిమానులు మరో హీరోను కూడా ప్రశంసించడానికి, వారి అభిమానులతో స్నేహభావంతో మెలగడానికి చాల సమయం పట్టింది. ఇప్పటికి సోషల్ మీడియాలో చాలాసార్లు అగ్లీ ఫైట్స్ జరగడం చూస్తూనే ఉన్నాము. అయితే ఇప్పుడు సమయం మారింది. అలాగే టెక్నాలజీ కూడా మారింది కదా. మరి అభిమానం కూడా యూటర్న్ తీసుకోవాలి కదా. తీసుకుంది కూడా… ఇటీవల కాలంలో స్టార్స్ ఫ్యాన్స్ అభిమానం పేరుతో మూగజీవాలను బలిస్తూ చిక్కుల్లో పడుతున్నారు.

Read Also : ఉత్తమ నటుడిగా మహేష్ బాబు

రీసెంట్ గా సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు “అన్నాత్తే” మూవీ ఫస్ట్ లుక్ విడుదలైన సందర్భంగా మేకను బలిచ్చి, రజనీ పోస్టర్‌కు రక్తంతో అభిషేకం చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అభిమానుల సైకో ప్రవర్తనకు అన్ని వర్గాల నుండి తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రజనీ అధికారిక అభిమానుల సంఘం కొంతమంది అభిమానుల ఆందోళనకర చర్యను ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది.

తాజాగా మేకను బలిచ్చిన అభిమానులు తీవ్రమైన ఇబ్బందుల్లో పడ్డారు. జంతువుల సంరక్షణ సంస్థ పెటా ఇండియా తమిళనాడులో ఈ చర్యకు పాల్పడ్డ రజనీ అభిమానులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. పెటా ప్రకారం జంతువును చంపడం, జంతువుల పట్ల హింస నిరోధక (స్లాటర్ హౌస్ 2001) చట్టం నియమాలను ఉల్లంఘిస్తుంది. అలాంటి చర్య ఐపీసీ సెక్షన్ 429 ప్రకారం శిక్షార్హమైనది. ఇటీవల కన్నడ సూపర్ స్టార్ సుదీప్ అభిమానులు కూడా ఇలాగే ఏకంగా గేదెను బలిచ్చి, అరెస్ట్ కావాల్సి వచ్చింది.

Exit mobile version