ఇప్పుడు అభిమానం కొత్త చిక్కులు తెచ్చి పెడుతోంది. ఇంతకుముందు అభిమానం పేరుతో ఫ్యాన్స్ కొట్టుకున్నారు, చంపుకున్నారు. ఆ పరిస్థితి మారడానికి, ఒక హీరో అభిమానులు మరో హీరోను కూడా ప్రశంసించడానికి, వారి అభిమానులతో స్నేహభావంతో మెలగడానికి చాల సమయం పట్టింది. ఇప్పటికి సోషల్ మీడియాలో చాలాసార్లు అగ్లీ ఫైట్స్ జరగడం చూస్తూనే ఉన్నాము. అయితే ఇప్పుడు సమయం మారింది. అలాగే టెక్నాలజీ కూడా మారింది కదా. మరి అభిమానం కూడా యూటర్న్ తీసుకోవాలి కదా. తీసుకుంది కూడా……
సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న “అన్నాత్తే” వచ్చేసింది. రజినీకాంత్ ప్రస్తుతం శివ దర్శకత్వంలో “అన్నాత్తే” అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ భారీ ప్రాజెక్ట్‌ను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఇంతకుముందు రజనీకాంత్ సూపర్ హిట్ సినిమాలు ఎందిరన్, పెట్టా లను కూడా ఈ బ్యానర్ పైనే నిర్మించారు. ఇక ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో పాటు ఖుష్బూ, మీనా, నయనతార, కీర్తి సురేష్, ప్రకాష్ రాజ్, జగపతి…