కరోనా మహమ్మారి కేసులు తగ్గుముఖం పట్టినా.. తాజా హెచ్చరికలు భయపెడుతూనే ఉన్నాయి… సెకండ్ వేవ్ కేసులు పూర్తిస్థాయిలో తగ్గకముందే.. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కరోనా థర్డ్ వేవ్ ప్రారంభదశలో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది.. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. లేకపోతే మరోసారి వినాశనం తప్పదని పేర్కొంది. అయితే, భారత్‌లో కరోనా కట్టడి కోసం విధించిన ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి… కేసులు తగ్గుముఖం పట్టడంతో.. లాక్‌డౌన్‌కు గుడ్‌బై చెప్పి.. అన్‌లాక్‌కు వెళ్లినా.. ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఈ నేపథ్యంలో.. మతపరమైన పండుగలపై రాజస్థాన్ ప్రభుత్వం నిషేధాస్త్రం విధించింది.
త్వరలో జరగనున్న కన్వర్ యాత్ర, ఈదుల్ జుహా పండుగల సందర్భంగా ఎలాంటి బహిరంగ మతపరమైన కార్యక్రమాలు చేపట్టరాదని ఆదేశించింది ఆ రాష్ట్ర సర్కార్.. మధురలోని గోవర్థన ఏరియాలో ప్రతి ఏటా నిర్వహించే వార్షిక ముడియా పూనో మేళాను ఈ ఏడాది రద్దు చేయగా.. చాతుర్మాస పండుగ సందర్భంగా భక్తులు గుమిగూడటానికి అనుమతి లేదని స్పష్టం చేసింది.. అన్ని మతాల వారు తమ తమ మతపరమైన కార్యక్రమాలను ఇళ్లలోనే చేసుకోవాలని సూచించింది ప్రభుత్వం.