టీడీపీ తీరుపై వైసీపీ ఎంపీ భరత్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో చేపడుతున్న సంక్షేమ పథకాలపై టీడీపీ చేస్తున్న విమర్శలపై వైసీపీ ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. రాజమండ్రి సుబ్రహ్మణ్య మైదానంలో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం లబ్దిదార్లకు రిజిస్ట్రేషన్ పత్రాలు అందజేశారు ఎంపీ మార్గాని భరత్. వన్ టైం సెటిల్మెంట్ పథకం ఒక చక్కని కార్యక్రమం అన్నారు భరత్. ఉరివేయడం, విషం తాగడం అంటూ టీడీపీ నేతలు బురద జల్లుతున్నారని విమర్శించారు.
సీఎం జగన్ రాష్ట్రంలో పేదలకు లక్షా 25 వేల కోట్ల రూపాయలు వివిధ పథకాల ద్వారా అందజేశారు. ఎవరి ప్రమేయం లేకుండా బటన్ నొక్కడం ద్వారా నేరుగా పేదల ఖాతాల్లోకి డబ్బులు జమచేశారన్నారు ఎంపీ భరత్. ఇలాంటి పథకాలను విమర్శిస్తున్న టీడీపీ తీరుని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇళ్లు లేని పేదలకు సంపూర్ణ హక్కులు కల్పించాలని, వారి ఇళ్లపై వారికి అధికారాలను ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సర్కార్..జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకాన్ని తీసుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 52 లక్షల కుటుంబాలకు 1.58 లక్షల కోట్ల ఆస్తిని ఈ పథకం ద్వారా పేదలకు అందించనుంది ప్రభుత్వం. ఈ పథకం ఉగాది వరకూ కొనసాగనుంది.
Also Read
తాజావార్తలు
-
Chiranjeevi MEGAVerse : నెట్‌ఫ్లిక్స్‌లో చిరు సెన్సేషన్ ‘మెగావర్స్’.. తొలి ఎపిసోడ్‌లోనే ఆ ముగ్గురు!
-
Ind Vs NZ: సెంచరీతో కదం తొక్కిన కాటేరమ్మ కొడుకు.. పలు ప్రపంచ రికార్డులు బద్దలు..
-
Donald Trump: ట్రంప్‌పై అత్యాచార ఆరోపణలు.. మాజీ మిస్ స్విట్జర్లాండ్ సంచలన వ్యాఖ్యలు!
-
Vrushakarma : నాగవంశీ అవుట్.. దిల్ రాజు ఇన్..’వృషకర్మ’ వెనుక అసలేం జరిగింది?
-
DA Hike: ఉద్యోగులు, పెన్షన్‌దారులకు శుభవార్త.. రేపే డీఏ పెంపు..?
ట్రెండింగ్
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!
-
Kitchen Cleaning Tips: మాడిపోయిన గిన్నెలను మెరిపించే సింపుల్ ట్రిక్స్.. ఈ 5 పద్ధతులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!