Rains-Memes: గ్యాప్ ఇవ్వరా.. కొంచెం. వరుణుడిపై నెటిజన్ల ఫ్రస్టేషన్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వారం రోజులుగా వర్షాలు విడవకుండా కురుస్తున్నాయి. మరో రెండు మూడు వరకూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో సాధారణ జనజీవనానికి తీవ్ర ఆటంకం కలుగుతోంది. విద్యార్థులు, వీధివ్యాపారులు సహా చాలా మంది ఇళ్లకే పరిమితమవుతున్నారు. బయటికి వద్దామంటే భయపడుతున్నారు. ‘ఇదెక్కడి వానరా బాబూ’ అనుకుంటూ తీవ్ర అసహనానికి గురవుతున్నారు. కొంత మంది తమ ఫ్రస్టేషన్‌ని ఎలా తగ్గించుకోవాలో తెలియక వాన దేవుడిపై సోషల్ మీడియాలో జోకులు పేలుస్తున్నారు. తెలుగు సినిమాల్లోని కామెడీ క్లిప్పింగ్‌లతో కూడిన మీమ్స్‌ని పోస్ట్ చేస్తున్నారు.
వర్షం వల్ల అసౌకర్యంగా ఫీలవుతున్నవాళ్లు ఈ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కాస్త రిలీఫ్ పొందుతున్నారు. ‘7/జీ బృందావన్ కాలనీ’ సినిమాలో కమెడియన్ సుమన్ శెట్టి మేడ పైన నిద్రపోతున్నప్పుడు హీరో, హీరోయిన్, చివరికి వాన కూడా డిస్టర్బ్ చేయటంతో నెత్తి మీద బాదుకుంటూ బోరున విలపిస్తాడు. ఈ సీన్‌ని రుద్ర అనే నెటిజన్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేశాడు. రామానుజం అనే మరో వ్యక్తి ‘ఇదేం వర్షంరా నాయనా?. ఇట్లా తగిలింది’ అని తిట్టుకున్నాడు. ‘అదుర్స్’ మూవీలో కమెడియన్ బ్రహ్మానందం హీరో జూనియర్ ఎన్టీఆర్‌తో ‘గ్యాప్ ఇవ్వరా.. కొంచెం’ అనే డైలాగ్ ఉన్న వీడియోని అప్‌లోడ్ చేశాడు.
Also Read
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
మరికొంతమంది.. వాతావరణ శాఖ అధికారుల అవతారమెత్తి సరదాగా వర్ష సూచన చేస్తున్నారు. ‘హైదరాబాద్‌లో ఇవాళ వానొస్తుందని చెప్పిన రోజు వాన రాదు. పొడి వాతావరణం ఉంటుంది. వర్షం పడే అవకాశమే లేదన్న రోజు ఖచ్చితంగా వర్షం కురిసి తీరుతుంది’ అని ఇంకో యూజర్ సెటైర్ వేశాడు. రీసెంట్ హిట్ మూవీ ‘డీజే టిల్లు’లో యాక్టర్ సిద్ధూ జొన్నలగడ్డ చెప్పిన డైలాగ్ ‘అట్లుంటది మనతోని’ అంటూ ట్వీట్ చేశాడు. ఆగకుండా కురుస్తున్న వర్షాలతో రైతులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే చాలా చోట్ల పంట నష్టం జరిగింది.
ఈ మేరకు ప్రభుత్వం నుంచి పరిహారాన్ని ఆశిస్తున్నారు. కానీ అధికారులు క్షేత్ర స్థాయికి వెళ్లి పరిశీలించి నివేదిక తయారుచేసే పరిస్థితి. వర్షాల నేపథ్యంలో రాజకీయ నాయకులూ రంగ ప్రవేశం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం గత ఎనిమిదేళ్లుగా పంట నష్ట పరిహారాన్ని ఇవ్వట్లేదని కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ స్టేట్ ప్రెసిడెంట్ విమర్శించారు. పంట బీమా లేకపోవటంతో తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని సాయిరెడ్డ అనే రైతు వాపోయాడు. జూలై నెలలో ఈ స్థాయిలో వాన పడటం తానెప్పుడూ చూడలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
తాజావార్తలు
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!