Site icon NTV Telugu

పంజాబ్‌ ఘటన దురదృష్టకరం : పవన్‌ కల్యాణ్‌

pawan kalyan

pawan kalyan

ఇటీవల ప్రధాన మోడీ పంజాబ్‌ పర్యటనకు వెళ్లారు. అయితే మోడీ కాన్వాయ్‌ వస్తున్న విషయం తెలిసిన అక్కడి రైతులు రోడ్డుపై బైఠాయించి మోడీ కాన్వాయ్‌కి అడ్డుపడ్డారు. సుమారు 15 నిమిషాల పాటు రైతులు అడ్డుతొలుగుతారేమోనని మోడీ ఎదురుచూశారు. అప్పటికీ రైతులు ఆందోళనను విరమించకపోవడంతో మోడీ వెనుదిరిగి వెళ్లిపోయారు. ఈ ఘటన ప్రస్తుతం దేశంలోనే హాట్‌టాపిక్‌గా మారింది.

అయితే ఘటన దురదృష్టకరమని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేయడం ప్రజల హక్కే, కానీ ప్రధాని మోడీకి ఇబ్బంది కలిగేలా చేయడం సరికాదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్స్‌ను తు.చ తప్పకుండా చేయాల్సిన బాధ్యత రాష్ట్రాలదేనని ఆయన వెల్లడించారు. క్లిష్ట పరిస్థితుల్లో సంయమనం పాటించిన మోడీకి అభినందనలు అని ఆయన అన్నారు.

https://ntvtelugu.com/sajjala-said-he-hoped-the-cm-would-respond-positively-to-the-prc/
Exit mobile version