పాన్ ఇండియా హీరో నటిస్తున్న లేటెస్ట్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ప్రాజెక్ట్ కె’ కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులని మరోసారి ఆకట్టుకుంది వైజయంతీ మూవీస్. ఈ చిత్ర భారీ తారాగణంలో కమల్ హాసన్ రాకతో సినిమా సంచలనం సృష్టించింది.. శాన్ డియాగో కామిక్-కాన్‌లో పాల్గొనే మొదటి భారతీయ చిత్రంగా నిలిచింది ప్రాజెక్ట్ కె.. తాజాగా విడుదలైన దీపికా పదుకొణె ఇంటెన్స్ ఫస్ట్ లుక్ అందరినీ సర్ప్రైజ్ చేసింది.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.. తాజాగా ఈ చిత్రం నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది. ఇది గొప్ప సినిమాటిక్ అనుభూతిని కలిగిస్తుంది. సెపియా టోన్డ్ క్యాప్టివేటింగ్ ఇమేజ్‌లో ప్రభాస్ పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ ప్రేక్షకులని మెస్మరైజ్ చేసింది. అద్భుతంగా రూపొందించిన ఫస్ట్ లుక్ విజువల్ ఈ చిత్ర ఎక్స్ టార్డినరీ నిర్మాణ విలువలకు నిదర్శనంగా నిలుస్తోంది.
ఈ పోస్టర్ విడుదలైన కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియాలో, ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానుల్లో ఉత్కంఠను రేకెత్తించింది.. ఒకవైపు విమర్శలు అందుకున్న, అభిమానుల ప్రశంసలతో పోస్టర్ నెట్టింట హల్ చల్ చేస్తుంది.. ఇక తాజాగా సినిమా నుంచి టీజర్ ను విడుదల చేశారు మేకర్స్.. టీజర్ తో పాటు టైటిల్ ను కూడా అనౌన్స్ చేశారు.. ముందుగా ఫ్యాన్స్ అనుకున్నట్లే నాగ్ అశ్విన్ ‘కల్కి -2898AD’ టైటిల్ ను ఫిక్స్ చేశారు..ఒక్కో సీన్ గూస్ బంబ్స్ తెప్పిస్తుంది.. ఇక టీజర్ లోని ప్రతి సీన్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి.. టీజర్ లోని కొన్ని సన్నీవేశాలు గూస్ బంబ్స్ తెప్పిస్తున్నాయి.. థియేటర్లు దద్దరిల్లి పోతాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.. ఈ టీజర్ విడుదలైన కొద్ది నిమిషాల్లోనే ట్రెండింగ్ లో ఉంది.. వ్యూస్, కామెంట్స్, లైక్స్ తో దూసుకుపోతుంది.. టీజర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేస్తుంది..
భారీ బడ్జెట్ తో పాటు, ప్రభాస్ రేంజుకు తగ్గట్లు భారీ యాక్షన్ తో సినిమా రూపోందుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాలో అమితాబ్‌బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకొణె.. తదితర భారీ తారాగణం కూడా ఈ సినిమాలో నటిస్తుండడంతో పాన్ ఇండియా స్థాయి నుంచి పాన్ వరల్డ్ స్థాయిలో ఈ చిత్రం హైప్ క్రియేట్ చేస్తోంది. అందుకే సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ విడుదల అయినా క్షణాల్లోనే వైరల్‌గా మారి అభిమానులను విపరీతంగా ఆకట్టకుంటున్నాయి.. త్వరగా షూటింగ్ ను పూర్తి చేసి ప్రమోషన్స్ మొదలు పెట్టాలని మేకర్స్ యోచనలో ఉన్నాయి.. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు..