ఉత్తర ప్రదేశ్‌లో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో లఖింపూర్ ఘటన కలకలం రేపింది. రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. కేంద్ర మంత్రి కుమారుడు ఈ యాక్సిడెంట్‌కు కారణం కావడంతో ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. అటు సుప్రీం కోర్టు కూడా ఈ ఘటనలపై సీరియస్ అయింది. ఈరోజు క్రైమ్ బ్రాంచ్ ముందు ఆశిశ్ మిశ్రా హాజరయ్యారు. లఖింపూర్ బాధితులను పరామర్శించేందుకు ప్రియాంక గాంధీని మొదట అనుమతించలేదు. అమెను సీతాపూర్‌లోని గెస్ట్ హౌస్‌లో నిర్భందించారు. ఆ సమయంలో చీపురు పట్టి తన గదిని శుభ్రం చేశారు. ప్రియాంక గాంధీ చీపురుపట్టడంపై యూపీ ముఖ్యమంత్రి స్పందించి, ఆమెకు ఆపని కరెక్ట్ అని ట్వీట్ చేయడంతో మరో వివాదం చెలరేగింది. ఈరోజు లఖిన్‌పూలోని ఓ దళితవాడలో పర్యటించి చీపురుపట్టి వాడలను శుభ్రం చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కమిటీలు వాల్మీకి దేవాలయాలను శుభ్రం చేయాలని ట్వీట్ చేశారు. త్వరలో జరగబోతున్న ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవాన్ని తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు.
झाड़ू लगाना स्वाभिमान का काम है।
— UP Congress (@INCUttarPradesh) October 8, 2021
अपनी सोच बदलिए @myogiadityanath pic.twitter.com/E3S6eTxjrZ
Read: మూసీలో మొసలి… భయాందోళనలో స్థానికులు…