ర‌త‌న్ టాటాకు అరుదైన బ‌హుమ‌తి… ఎందుకంటే…

అప్పుల్లో కూరుకుపోయిన ఎయిర్ ఇండియా సంస్థ‌ను టాటా స‌న్స్ చేజిక్కించుకున్న‌ది.  ఎయిర్ ఇండియా సంస్థ‌ను టాటాలే స్థాపించారు.  ఆ త‌రువాత అందులో భార‌త ప్ర‌భుత్వం పెట్టుబ‌డులు పెట్ట‌డంతో అది ప్ర‌భుత్వ‌రంగ సంస్థ‌గా మారింది.  కాగా, ఇప్పుడు ఆ సంస్థ అప్పుల్లో కూరుకుపోవ‌డంతో తిరిగి టాటాలు బిడ్‌లో ద‌క్కించుకున్నారు.   తాము స్థాపించిన సంస్థ తిరిగి టాటాల‌కు చేర‌డంతో సంతోషాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.  ఎయిర్ ఇండియాను తిరిగి ద‌క్కించుకున్న ర‌త‌న్ టాటాకు ముంబైలోని స‌ర్ ర‌త‌న్ టాటా ఇనిస్టిట్యూట్ ఎయిర్ ఇండియా విమానం ఆకారంలో ఉన్న బిస్కెట్‌ను బహుమ‌తిగా పంపింది.  ఎలాంటి లాభాపేక్ష లేకుండా ముంబైలో స‌ర్ ర‌త‌న్ టాటా ఇనిస్టిట్యూట్ పేరుతో బేక‌రీని నిర్వ‌హిస్తున్నారు.  పార్శి రుచుల‌ను అంద‌రికి ప‌రిచ‌యం చేసేందుకు 1928లో లేడీ న‌వాజ్‌భాయ్ టాటా ఈ బేక‌రీని స్థాపించారు.  అప్ప‌టి నుంచి అతి త‌క్కువ ధ‌ర‌ల‌కే బేక‌రీ ఉత్ప‌త్తుల‌ను వినియోగ‌దారుల‌కు అందిస్తున్నారు.  

Read: గుడ్ న్యూస్‌: త‌గ్గుతున్న వంట‌నూనె ధ‌ర‌లు…

ర‌త‌న్ టాటాకు అరుదైన బ‌హుమ‌తి... ఎందుకంటే...
-Advertisement-ర‌త‌న్ టాటాకు అరుదైన బ‌హుమ‌తి... ఎందుకంటే...

Related Articles

Latest Articles