Site icon NTV Telugu

భారతదేశం కోసం ఆవిష్కరణలు చేద్దాం : ప్రధాని మోడీ

ఈ రోజు ఉదయం 10.30 గంటలకు స్టార్టప్‌ల ప్రతినిధులతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆరు అంశాలపై స్టార్టప్‌ ప్రతినిధులు ప్రజెంటేషన్‌ ఇచ్చారు. అయితే ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. జనవరి 16ను జాతీయ అంకుర దినోత్సవంగా జరుపుకోవాలన్నారు. అంకుర సంస్థలు నవ భారతానికి వెన్నెముకగా మారనున్నాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. భారతదేశంలో కోసం ఆవిష్కరణలు చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. అంతేకాకుండా భారతదేశం నుంచి ఆవిష్కరణలు చేద్దామన్నారు.

దేశంలోని ప్రతి జిల్లాలోనూ అంకుర సంస్థలు రావాలన్నారు. కొత్త ఆవిష్కరణలతో ముందుకొస్తున్న యువతకు మోడీ అభినందనలు తెలిపారు. విశ్వయవనికపై భారత అంకుర పతాకం ఎగురవేయాలన్నారు. 2013-14లో 4 వేలు పేటెంట్లు ఉండగా.. గతేడాది 28 వేలకు పేటెంట్లు పెరిగాయని ఆయన వెల్లడించారు. యువత ఆలోచనలు విశ్వవ్యాప్తంగా ప్రభావితం చేసేలా ఉండాలన్నారు.

Exit mobile version