భోగి శుభాకాంక్షలు తెలిపిన రాజకీయ ప్రముఖులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భోగి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని ఏపీలో సంబరాలు అంబరానంటాయి. వేకువజామునే భోగి మంటలు వేసి కోలాహలంగా కుటుంబ సమేతంగా అందరూ పండుగను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ రాజకీయ ప్రముఖులు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
- కుటుంబ సమేతంగా కారంచేడులోని తన సోదరి పురందేశ్వరి నివాసంలో నందమూరి బాలకృష్ణ భోగి పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తెలుగు ప్రజలకు, భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో సంపద పెంచే పండుగ సంక్రాంతి అని, పంటలు ఇంటికి చేరే పండుగ సంక్రాంతి అని ఆయన అన్నారు.
- చెన్నైలో కొట్టూర్పురంలోని ఆయన నివాసం వద్ద ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సతీసమేతంగా భోగి మంటలు వేశారు. సకల జనులకు భోగి.. సుఖసంతోషాలు కలిగించాలని వెంకయ్యనాయుడు అన్నారు. ప్రతి ఒక్కరూ సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని ఆయన అన్నారు. అందిరి జీవితాలు ఆరోగ్యం, శ్రేయస్సుతో ఆనందమయం కావాలన్నారు.
- సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఏపీ గవర్నర్ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగువారి ముఖ్యమైన పండుగ సంక్రాంతి, తెలుగువారంతా ఆనందంగా పండుగ జరుపుకోవాలని ఆయన అన్నారు.
- టీడీపీ అధినేత చంద్రబాబు తెలుగు ప్రజలకు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా ఆనందోత్సాహాలతో సంక్రాంతి జరుపుకోవాలని ఆయన అన్నారు. ప్రతి తెలుగు లోగిలిలో సంక్రాంతి కొత్త వెలుగులు నింపాలన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజలు పండుగ జరుపుకోవాలన్నారు.
- టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రజలందరికీ భోగీ, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఎక్కడ ఉన్నా సందడిగా పండుగ జరుపుకోవాలన్నారు.
https://ntvtelugu.com/bhogi-festival-celebrations-in-telugu-states/
Also Read
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!