Site icon NTV Telugu

పవన్‌ను అడ్డుకున్న పోలీసులు.. కారు టాప్‌పై కూర్చొని జనసేనాని నినాదాలు

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ రాజమండ్రి పర్యటనకు ఎలాంటి అడ్డంకులు లేవని చెబుతూనే.. ఏకంగా పవన్‌ కాన్వాయ్‌ని అడ్డుకున్నారు పోలీసులు.. రాజమండ్రి క్వారీ సెంటర్‌కు పవన్‌ కల్యాణ్‌ కాన్వాయ్‌ చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నారు.. పవన్‌ కాన్వాయ్ ను అడ్డుకోవద్దు అంటూ పోలీసులతో జనసైనికులు వాగ్వాదానికి దిగారు.. దీంతో, కాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఇక, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేనాని పవన్.. తన కారు టాప్‌పై కూర్చొని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. ఆ తర్వాత పవన్‌ కల్యాణ్‌ కాన్వాయ్‌ని వదిలిపెట్టారు పోలీసులు. కాగా, రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న పవన్‌ కల్యాణ్‌కు ఘనస్వాగతం పలికారు జనసైనికులు.. రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఆయన కాన్వాయ్‌ని అనుసరిస్తూ.. బైక్‌లపై పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

Exit mobile version