Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Pm Modi To Commence His Campaign Blitz In Karnataka Polls

Karnataka Elections: కర్ణాటకలో వేడెక్కిన రాజకీయం.. ప్రధాని మోడీ ఎన్నికల శంఖారావం

Published Date :April 29, 2023 , 9:11 am
By NTV WebDesk
Karnataka Elections: కర్ణాటకలో వేడెక్కిన రాజకీయం.. ప్రధాని మోడీ ఎన్నికల శంఖారావం
  • Follow Us :
  • google news
  • dailyhunt

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పీక్స్ స్టేజ్ కి చేరకుంటున్నాయి. ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారంతో దూసుకెళ్తున్నాయి. మే 10న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కర్నాటకలో మరోసారి కమలం తినిపించేలా బీజేపీ జోరుగా ప్రచారం ప్రారంభించింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దృష్ట్యా ప్రధాని నరేంద్ర మోదీ శనివారం (ఏప్రిల్ 29) నుంచి ఎన్నికల శంఖారావం మోగించనున్నారు. ఈ సందర్భంగా రెండు రోజుల్లో ప్రధాని 6 ర్యాలీలు, రెండు రోడ్ షోలు నిర్వహించనున్నారు. ప్రధాని మోదీతో పాటు బీజేపీ సీనియర్ నేతలు అమిత్ షా, జగత్ ప్రకాశ్ నడ్డా, రాజ్‌నాథ్, శివరాజ్ సింగ్ చౌహాన్, యోగి ఆదిత్యనాథ్ కూడా కర్ణాటకలో రోడ్ షోలు, ర్యాలీలు నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మే 7వ తేదీ వరకు రోడ్‌షోల్లో పాల్గొనడంతో పాటు వివిధ జిల్లాల్లో 19 బహిరంగ సభల్లో ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు.
Also Read:Poonch Terror Attack: పూంచ్ దాడిలో సంచలన విషయం.. ఉగ్రవాదులకు స్థానికుల సాయం..

ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం శనివారం (ఏప్రిల్ 29) కర్ణాటక చేరుకుంటున్నారు. ప్రధాని తన షెడ్యూల్ ప్రకారం శనివారం ఉదయం 11 గంటలకు హుమ్నాబాద్ చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటలకు విజయపుర, 2.45 గంటలకు కుడచిలో ర్యాలీలో ప్రసంగిస్తారు. ఈ ర్యాలీల అనంతరం సాయంత్రం బెంగళూరుకు వెళ్లనున్న ప్రధాని మోదీ అక్కడ మెగా రోడ్‌షో చేయనున్నారు.

ఏప్రిల్ 30న ఉదయం 11.30 గంటలకు కోలార్‌లో ప్రధాని మోదీ బహిరంగ సభ. అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు రాంనగర్ జిల్లా చన్నపట్నలో ర్యాలీ నిర్వహిస్తారు. అక్కడ JD(S) నాయకుడు మరియు మాజీ ముఖ్యమంత్రి H.D. కుమారస్వామి పోటీ చేస్తున్నారు. రామ్‌నగర్‌ తర్వాత హాసన్‌లోని బేలూరుకు వెళ్లనున్న ప్రధాని అక్కడ మధ్యాహ్నం 3.45 గంటలకు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రధాని మోదీ ఆదివారం సాయంత్రం టిప్పు సుల్తాన్ నగరం మైసూర్‌లో ఉంటారు. మైసూరులో ప్రధాని రోడ్‌షో ద్వారా బీజేపీకి ఓట్లు అడగనున్నారు. బెంగళూరు నార్త్, బెంగళూరు సెంట్రల్ పార్లమెంటరీ నియోజకవర్గాల్లో వేర్వేరు రోజుల్లో రోడ్‌షోలు నిర్వహించనున్న మోడీ.. బెంగళూరు సౌత్‌లో జరిగే బహిరంగ సభలో కూడా ప్రసంగించనున్నారు. మే 7వ తేదీన బెంగళూరు సెంట్రల్ పార్లమెంటరీ నియోజకవర్గ ప్రాంతాల్లో జరిగే రోడ్‌షోతో రాష్ట్రంలో ఆయన ప్రచారం ముగియనుంది.
Also Read:Woman Suicide: బ్యూటీపార్లర్‌కు వెళ్లనివ్వడం లేదని భార్య ఆత్మహత్య

ఓటింగ్‌కు 10 రోజులు మాత్రమే మిగిలి ఉన్న తరుణంలో కర్ణాటకలో ప్రధాని మోదీ ర్యాలీలు ప్రారంభమవుతున్నాయి. ఈసారి కూడా ఎన్నికల పోరును తనకు అనుకూలంగా మార్చుకుంటుందనే ఆశాభావంతో బీజేపీ ఉంది. మొత్తం 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీకి ఒకే దశలో పోలింగ్ జరగనుంది. మే 13న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. కాగా, ప్రధానమంత్రి జనవరి 14 నుండి ఇంతకుముందు ఎనిమిది సార్లు రాష్ట్రాన్ని సందర్శించడం గమనార్హం.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • Humnabad
  • karnataka
  • Karnataka Election
  • PM Narendra Modi

తాజావార్తలు

  • YS Jagan: అమరావతి అవినీతి గని.. MAVIGUN ప్రణాళికే బెస్ట్‌..!

  • Shouryuv: ఆ ఒక్క కారణంతోనే మృణాల్‌ని ఫిక్స్ చేశా.. డైరెక్టర్ శౌర్యువ్ మాటలకు నాని షాక్!

  • Lenin vs Peddi : ‘లెనిన్’ దిగుతున్నాడు.. ‘పెద్ది’ పరిస్థితేంటి? 

  • ACB: రిటైర్డ్ కాబోయే ఉపాధ్యాయుడి నుంచి లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన హెడ్మాస్టర్

  • Tesla Struggles in India: భారత్‌లో టెస్లా ఆపసోపాలు.. 7 నెలల్లో కేవలం 342 కార్లే విక్రయం.. దుమ్మురేపుతున్న ఇతర EV కార్లు..!

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions