కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పీక్స్ స్టేజ్ కి చేరకుంటున్నాయి. ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారంతో దూసుకెళ్తున్నాయి. మే 10న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కర్నాటకలో మరోసారి కమలం తినిపించేలా బీజేపీ జోరుగా ప్రచారం ప్రారంభించింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దృష్ట్యా ప్రధాని నరేంద్ర మోదీ శనివారం (ఏప్రిల్ 29) నుంచి ఎన్నికల శంఖారావం మోగించనున్నారు. ఈ సందర్భంగా రెండు రోజుల్లో ప్రధాని 6 ర్యాలీలు, రెండు రోడ్ షోలు నిర్వహించనున్నారు. ప్రధాని మోదీతో పాటు బీజేపీ సీనియర్ నేతలు అమిత్ షా, జగత్ ప్రకాశ్ నడ్డా, రాజ్‌నాథ్, శివరాజ్ సింగ్ చౌహాన్, యోగి ఆదిత్యనాథ్ కూడా కర్ణాటకలో రోడ్ షోలు, ర్యాలీలు నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మే 7వ తేదీ వరకు రోడ్‌షోల్లో పాల్గొనడంతో పాటు వివిధ జిల్లాల్లో 19 బహిరంగ సభల్లో ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు.
Also Read:Poonch Terror Attack: పూంచ్ దాడిలో సంచలన విషయం.. ఉగ్రవాదులకు స్థానికుల సాయం..
ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం శనివారం (ఏప్రిల్ 29) కర్ణాటక చేరుకుంటున్నారు. ప్రధాని తన షెడ్యూల్ ప్రకారం శనివారం ఉదయం 11 గంటలకు హుమ్నాబాద్ చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటలకు విజయపుర, 2.45 గంటలకు కుడచిలో ర్యాలీలో ప్రసంగిస్తారు. ఈ ర్యాలీల అనంతరం సాయంత్రం బెంగళూరుకు వెళ్లనున్న ప్రధాని మోదీ అక్కడ మెగా రోడ్‌షో చేయనున్నారు.
ఏప్రిల్ 30న ఉదయం 11.30 గంటలకు కోలార్‌లో ప్రధాని మోదీ బహిరంగ సభ. అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు రాంనగర్ జిల్లా చన్నపట్నలో ర్యాలీ నిర్వహిస్తారు. అక్కడ JD(S) నాయకుడు మరియు మాజీ ముఖ్యమంత్రి H.D. కుమారస్వామి పోటీ చేస్తున్నారు. రామ్‌నగర్ తర్వాత హాసన్‌లోని బేలూరుకు వెళ్లనున్న ప్రధాని అక్కడ మధ్యాహ్నం 3.45 గంటలకు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రధాని మోదీ ఆదివారం సాయంత్రం టిప్పు సుల్తాన్ నగరం మైసూర్‌లో ఉంటారు. మైసూరులో ప్రధాని రోడ్‌షో ద్వారా బీజేపీకి ఓట్లు అడగనున్నారు. బెంగళూరు నార్త్, బెంగళూరు సెంట్రల్ పార్లమెంటరీ నియోజకవర్గాల్లో వేర్వేరు రోజుల్లో రోడ్‌షోలు నిర్వహించనున్న మోడీ.. బెంగళూరు సౌత్‌లో జరిగే బహిరంగ సభలో కూడా ప్రసంగించనున్నారు. మే 7వ తేదీన బెంగళూరు సెంట్రల్ పార్లమెంటరీ నియోజకవర్గ ప్రాంతాల్లో జరిగే రోడ్‌షోతో రాష్ట్రంలో ఆయన ప్రచారం ముగియనుంది.
Also Read:Woman Suicide: బ్యూటీపార్లర్‌కు వెళ్లనివ్వడం లేదని భార్య ఆత్మహత్య
ఓటింగ్‌కు 10 రోజులు మాత్రమే మిగిలి ఉన్న తరుణంలో కర్ణాటకలో ప్రధాని మోదీ ర్యాలీలు ప్రారంభమవుతున్నాయి. ఈసారి కూడా ఎన్నికల పోరును తనకు అనుకూలంగా మార్చుకుంటుందనే ఆశాభావంతో బీజేపీ ఉంది. మొత్తం 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీకి ఒకే దశలో పోలింగ్ జరగనుంది. మే 13న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. కాగా, ప్రధానమంత్రి జనవరి 14 నుండి ఇంతకుముందు ఎనిమిది సార్లు రాష్ట్రాన్ని సందర్శించడం గమనార్హం.