అమెరికా పర్యటనను ముగించుకొని ఆదివారం సాయంత్రం ఇండియాకు తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. ఇండియాకు తిరిగి వచ్చిన వెంటనే ప్రధాని మోడీ ఎవరికీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సడెన్‌గా కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం జరుగుతున్న ప్రాంతాన్ని సందర్శించారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సడెన్‌గా భవనం నిర్మాణం జరుగుతున్న ప్రాంతాన్ని ప్రధాని సందర్శించడంతో ఇంజనీర్లు షాకయ్యారు. దాదాపు గంటసేపు ప్రధాని మోడీ నిర్మాణం జరుగుతున్న ప్రాంతాన్ని సందర్శించారు. పనితీరును అడిగి తెలుసుకున్నారు. 2022 శీతాకాల సమావేశాలు కొత్త పార్లమెంట్ భవనంలో నిర్వహించాలనే లక్ష్యంతో కేంద్రం నిర్మాణం పనులను చేపడుతున్నది. సెంట్రల్ విస్టా పనులను కూడా ప్రధాని పరిశీలించారు.
ఆదివారం రాత్రి ప్రధాని సడెన్ విజిట్… షాకైన ఇంజనీర్లు…
