గిఫ్ట్ ను అమ్ముకున్న పాక్ ప్రధాని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆయన దేశంలోని క్రికెటర్లకు ఆరాధ్య దైవం. రిటైర్మంట్ తర్వాత పాలిటిక్స్‌లోకి వచ్చి ప్రధాని అయ్యారు. క్రికెట్లోనే కాదు పాలిటిక్స్‌లోనూ లీడర్ని అని నిరూపించుకున్నారు. అయితే ఇటీవల ఆయన చేసిన పని.. అతడిని నవ్వులపాలు చేస్తోంది.
ఇమ్రాన్ ఖాన్.. పాకిస్థాన్ ప్రధానమంత్రి. క్రికెటర్ నుంచి ప్రధానిగా ఎదిగిన లీడర్. పాకిస్థాన్‌లో ఎంతో ఖ్యాతి ఉన్న ఇమ్రాన్ ఖాన్.. ఇప్పుడు తలదించుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆయన చేసిన పని.. ఇటీవల బయటపడింది. గిఫ్ట్‌గా వచ్చిన గడియారంను అమ్మి.. ఆ డబ్బులు నొక్కేశారని విమర్శలు వస్తున్నాయి. దీంతో ప్రతిపక్షాలు ఇమ్రాన్ ఖాన్‌పై విమర్శల బౌన్సర్లు విసురుతున్నాయి. ప్రధాని లాంటి పదవిలో ఉండి.. ఇలాంటి పని చేయడం ఏంటని ఏకిపారేస్తున్నాయి.
Also Read
- Delhi: ఘోరం.. వెబ్ సిరీస్ చూసి భార్యను చంపిన టెకీ.. ఆ తర్వాత ఏం చేశాడంటే..!
- PM Modi: ఆందోళన వద్దు.. ధైర్యంగా ఉండండి.. టీఎంసీ తిరుగుబాటు ఎంపీలకు మోడీ భరోసా
- Mumbai: సునేత్ర పవార్‌తో ప్రశాంత్ కిషోర్ భేటీ.. మహారాష్ట్రలో కొత్త ఊహాగానాలు
- Pakistan: ఉద్రిక్తతల వేళ టర్కీ, సౌదీ దేశాలతో పాకిస్థాన్ కొత్త కూటమి.. దేనికి సంకేతం!
ఇమ్రాన్ ఖాన్.. ఓ గల్ఫ్ దేశ యువరాజు ఇచ్చిన ఖరీదైన గడియారాన్ని విక్రయించి సుమారు రూ.7.4 కోట్లు జేబులో వేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఆయన తీరు సిగ్గుచేటని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మామూలుగా ఒక దేశ ప్రధాని.. మరో దేశంలో పర్యటించినప్పుడు అధికారికంగా ఇచ్చిన ఖరీదైన బహుమతులను.. గిఫ్ట్ డిపాజిటరీలో భద్రపరుస్తారు. వీటన్నింటినీ ప్రభుత్వ ఆస్తులుగా పరిగణిస్తారు. సొంతంగా అమ్ముకోకూడదు. నిబంధనల ప్రకారం వాటిని బహిరంగ వేలంలో విక్రయిస్తారు. అయితే ఇమ్రాన్ ఖాన్ కక్కుర్తి పడి.. ఈ బహుమతులను అమ్ముకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
అసలే పాకిస్థాన్ ఆర్ధిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంది. అత్యధిక విదేశీ అప్పులు కలిగిన టాప్ టెన్ దేశాల జాబితాలో పాకిస్థాన్ చేరిందని ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. ఇలాంటి పరిస్థితుల్లో దేశ ఖజానాకు చిల్లుపెట్టే పనుల్ని ఇమ్రాన్ ఖాన్ చేయడంపై దుమారం రేగుతోంది. ఇమ్రాన్ ఖాన్‌కు ఇదేం పాడుబుద్ధి అని విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. అసలే అంతంతమాత్రంగా ఉండే పాకిస్తాన్ పరువును.. ఇమ్రాన్ పూర్తిగా తీసేస్తున్నాడని సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.
తాజావార్తలు
-
Delhi: ఘోరం.. వెబ్ సిరీస్ చూసి భార్యను చంపిన టెకీ.. ఆ తర్వాత ఏం చేశాడంటే..!
-
Agni-4: అగ్ని-4 శక్తి ఇదే.. పాకిస్తాన్ మొత్తం, బీజింగ్-షాంఘై కూడా భారత పరిధిలోనే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ సిక్స్‌లు, ఫోర్లు కొడితే సరిపోతుందా..? ‘అతడిని తప్పించండి’..
-
Conch Shell Facts: శంఖం రహస్యం తెలుసా? పూజలో ఉపయోగించే ఈ వస్తువు వెనుక ఆశ్చర్యకరమైన నిజాలు
-
PM Modi: ఆందోళన వద్దు.. ధైర్యంగా ఉండండి.. టీఎంసీ తిరుగుబాటు ఎంపీలకు మోడీ భరోసా
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!