టీడీపీ-జనసేన పొత్తు.. మాజీ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరిషత్ ఎన్నికల ఫలితాలు కీలక పరిణామాలకు తెరలేపాయి.. ఇప్పటి వరకు దూరంగా ఉన్న టీడీపీ-జనసేన కలిసి ఆచంట ఎంపీపీ పదవిని టీడీపీ కైవసం చేసుకున్నది. మొత్తం 17 ఎంపీటీసీలు ఉన్న ఆచంటలో టీడీపీ 7 స్థానాలు, వైసీపీ 6 స్థానాలు, జనసేన 4 స్థానాల్లో విజయం సాధించగా.. టీడీపీ, వైసీపీలు ఇద్దరిలో ఎవరు ఎంపీపీ కావాలన్నా.. జనసేన మద్ధతు అవసరంగా మారింది. క్యాంపు రాజకీయాలు షురూ కావడంతో టీడీపీ, జనసేన పార్టీలు తమ ఎంపీటీసీలను రహస్యప్రాంతాలకు తరలించారు. కాగా, ఈ ఎంపీపీ పదవి కోసం టీడీపీ, జనసేన పార్టీలు పొత్తును కుదుర్చుకున్నాయి. పొత్తులో భాగంగా ఆచంట ఎంపీపీ పదవి టీడీపీ దక్కించుకోగా, వైస్ ఎంపీపీ పదవిని జనసేన దక్కించుకుంది.. అయితే, టీడీపీ-జనసేన దోస్తీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ..
టీడీపీ-జనసేన పార్టీ కలిసి పనిచేయడం మంచి పరిణామం అన్నారు పితాని సత్యనారాయణ.. ఆచంట నుంచే అది ప్రారంభం అయ్యిందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు రెండు పార్టీలు కలవాల్సిన పరిస్థితి ఉందని.. దీనిపై టీడీపీ, జనసేన పార్టీ అధినేతలు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో వైసీపీవారికే సంక్షేమ పథకాలు అందుతున్నాయని.. టీడీపీ, జనసేన ఇలా ఇతర పార్టీలకు చెందినవారు ఉంటే.. వారికి సంక్షేమ పథకాలు అందకుండా చేస్తున్నారని ఆరోపించారు. అయితే, దారుణంగా వ్యవహరిస్తున్న వైసీపీని గద్దెదించాలంటే.. ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలన్నారు.. అలాంటి సంకేతమే ఆచంట నుంచి మొదలైందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికే ఆచంటలో ఈ కలయిక ప్రారంభమైంది.. దీనిని అందరూ ఆహ్వానించాలన్నారు మాజీ మంత్రి పితాని సత్యనారయణ. ఇక, పితాని ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి..
Also Read
- CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్‌పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
- Rahul Gandhi: ‘బాధ మీది.. డేటా మీది.. సంపద వాళ్లది’! కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
- Lionel Messi: ఫుట్‌బాల్ లెజెండ్ మెస్సీ ఇంట్లో విషాదం!
- Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం? ఇరాన్లో తీవ్ర ఉత్కంఠ!
తాజావార్తలు
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Trump Secret Flight: ఇరాన్ ముప్పు.. క్యాటరింగ్ ట్రక్కులో ట్రంప్ తరలింపు.. అమెరికా రహస్య ఆపరేషన్..
-
King 100: నాగ్100పై సస్పెన్స్‌కు తెర.. ఆగస్టు 29న ఫస్ట్ లుక్, స్పెషల్ గ్లింప్స్!
-
Hyderabad: పంజాగుట్ట శ్మశానవాటికలో షాకింగ్ ఘటన.. పూడ్చిపెట్టిన పసికందు మృతదేహం మాయం
-
Crude Oil Prices: ఇరాన్‌కు ట్రంప్ ఊహించని షాక్.. ఆకాశాన్నంటిన క్రూడ్ ఆయిల్ ధరలు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!