ఏసీసీ పురుషుల టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2024లో భాగంగా.. భారత్- ‘ఎ’ జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్-‘ఎ’తో తలపడింది. ఒమన్‌లోని అల్ అమరత్ నగరంలో అల్ ఎమిరేట్స్ క్రికెట్ గ్రౌండ్‌లో ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ 7 పరుగుల తేడాతో గెలుపొందింది. ముందు టాస్ గెలిచిన భారత యువ జట్టు కెప్టెన్ తిలక్ వర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో బ్యాటింగ్ కు దిగిన టీమిండియా టీ20 నయా ఓపెనర్ అభిషేక్ శర్మ, వికెట్ కీపర్ ప్రభ్‌సిమ్రన్‌సింగ్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించారు. వీరిద్దరూ జట్టుకు మంచి శుభారంభాన్ని అందించారు. భారత్ బ్యాటింగ్‌లో తిలక్ వర్మ (44) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత.. అభిషేక్ శర్మ (35), ప్రభ్‌సిమ్రన్‌సింగ్ (36), నేహాల్ వధేరా (25), రమన్ దీప్ సింగ్ (17) పరుగులు చేయడంతో.. భారత్ 20 ఓవర్లో 8 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. పాకిస్తాన్ బౌలర్లలో సుఫియన్ ముఖీం 2 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత.. మహమ్మద్ ఇమ్రాన్, జమాన్ ఖాన్, అర్ఫత్ మిన్హాస్, ఖాసీం అక్రం తలో వికెట్ సంపాదించారు.
Read Also: Off The Record : జీవో 29 కాంగ్రెస్ కు ఇబ్బంది అవుతుందా ? రాహుల్ గాంధీ రంగంలోకి దిగుతారా ?
ఆ తర్వాత 184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్.. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. దీంతో.. భారత్ ఏ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. పాకిస్తాన్ బ్యాటర్లలో అత్యధికంగా అర్ఫత్ మిన్హాస్ (41) పరుగులు చేశాడు. ఆ తర్వాత యాసిర్ ఖాన్ (33), ఖాసీం అక్రం (27), అబ్దుల్ సమద్ (25), అబ్బాస్ అఫ్రిదీ (18) పరుగులు చేశారు. భారత్ బౌలర్లలో అనుషుల్ కాంబోజ్ అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత రసీఖ్ సలాం, నిశాంత్ సింధు తలో 2 వికెట్లు పడగొట్టారు.
Read Also: Group -1 Mains : గ్రూప్-1 పరీక్షలపై మంత్రుల కీలక సమావేశం