Site icon NTV Telugu

Bandi Sanjay : నిరుద్యోగ భృతి హామీ..ఏప్రిల్ ఫూల్స్ డే శుభాకాంక్షలు

Bandi Sanjay Letter

Bandi Sanjay Letter

ఏప్రిల్ ఫూల్స్ డే సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నిరుద్యోగ భృతి హామీపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. “నిరుద్యోగ యువతకు రూ.3016 భృతి ఇస్తాం – సీఎం కేసీఆర్. మీరు దానిని విశ్వసిస్తే, ఏప్రిల్ ఫూల్స్ డే శుభాకాంక్షలు! ” అంటూ బండి సంజయ్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
Also Read: Tension in Puttaparthi: పుట్టపర్తిలో టెన్షన్‌.. టెన్షన్‌..

తెలంగాణలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్‌ను టార్గెట్ చేసేందుకు బీజేపీ ఏ మాత్రం వెనుకంజ వేయడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలపై బీజేపీ దృష్టి పెట్టింది. ఇచ్చిన హామీ నెరవేర్చలేదంటూ బీజేపీ విమర్శలు చేస్తోంది. ఈ క్రమంలోనే బండి సంజయ్ తాజాగా ట్వీట్ చేశారు.

2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్(ప్రస్తుతం బీఆర్ఎస్) రెండోసారి అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి పథకం హామీని కేసీఆర్ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,016 అందించడమే ఈ పథకం లక్ష్యం. నిరుద్యోగ భృతి పథకంతో సహా కేసీఆర్ వాగ్దానాలను బీజేపీ నిరంతరం లక్ష్యంగా చేసుకోవడం రాబోయే ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు పొందాలనే వ్యూహంలో భాగమేనని తెలుస్తోంది.
Also Read: ED raids in Hyderabad: హైదరాబాద్‌లో ఈడీ సోదాలు కలకలం..
తెలంగాణలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధిక స్థానాలు గెలుపొందేందుకు బీజేపీ ఏ అవకాశాన్ని వదలడం లేదు. 2018లో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాలకు గాను 88 స్థానాల్లో టీఆర్‌ఎస్ విజయం సాధించగా, కాంగ్రెస్ కేవలం 19 సీట్లతో సరిపెట్టుకోగా, బీజేపీ ఒక్క సీటును మాత్రమే గెలుచుకోగలిగింది. అనంతరం జరిగిన దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో మాత్రం బీజేపీ విజయం సాధించింది. దీంతో అసెంబ్లీ బీజేపీ బలం మూడుకు పెరిగింది.

Exit mobile version