Site icon NTV Telugu

ఒమిక్రాన్ అలజడి.. దేశంలో 961కి చేరిన కేసులు

దేశంలో ఒమిక్రాన్ కేసులు అలజడి రేపుతున్నాయి. కేసుల్లో ఢిల్లీని అధిగమించింది మహారాష్ట్ర. పెరుగుతున్న కేసులు వల్ల ఆరోగ్య వ్యవస్థలు కుప్పకూలే అవకాశం వుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఒమిక్రాన్, డెల్టా వేరియంట్లు కలిసి పెద్ద ఎత్తున సునామీ లాగా కేసుల సంఖ్య నమోదయ్యే అవకాశం ఉందంటూ హెచ్చరించింది డబ్ల్యూహెచ్‌వో.

గతవారం ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 కేసుల సంఖ్య 11 శాతం పెరిగాయని తెలిపింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. కోవిడ్ కేసుల సంఖ్య పెరగడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ఢిల్లీలో ఇప్పటివరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 263 కాగా, మహారాష్ట్రలో అత్యధికంగా 252 కేసులు నమోదయ్యాయి. ముంబైలో నిన్న కొత్తగా 33 కేసులు నమోదు కాగా, రాష్ట్ర వ్యాపితంగా కొత్తగా 85 కేసులు నమోదయ్యాయి.

గుజరాత్ లో నిన్న మరో 19 కేసులు నమోదు కావడంతో 97 కు చేరిన “ఒమిక్రాన్” కేసులు. రాజస్థాన్ లో 69, కేరళ లో 65, తెలంగాణ లో 62 “ఒమిక్రాన్” కేసులు నమోదు. ఢిల్లీలో నిన్న కొత్తగా 923 కోవిడ్ కేసులు నమోదు. దేశంలో కొత్తగా మొన్న 9,195 కోవిడ్ కేసులు నమోదు. తాజాగా కోవిడ్ కేసుల సంఖ్య 13,154కి చేరాయి. ప్రతి దేశంలో 40 శాతం జనాభా ఈ ఏడాది చివరికల్లా వ్యాక్సిన్ తీసుకోవాలని, 2022 మధ్య కల్లా 70 శాతం జనాభా తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని కోరింది ప్రపంచ ఆరోగ్య సంస్థ.

ప్రపంచ ఆరోగ్య సంస్థలో మొత్తం 194 దేశాలకు సభ్యత్వం ఉంది. 92 దేశాలు 40 శాతం జనాభాకు వ్యాక్సిన్ ఇచ్చే లక్ష్యాన్ని చేరుకోలేకపోయాయని చెప్పారు డబ్ల్యు.హెచ్.ఓ అధ్యక్షుడు డా. టెడ్రాస్. 2020 లో 18 లక్షల మంది కోవిడ్-19 వల్ల చనిపోగా, 2021 లో 35 లక్షల మంది మృతి చెందారని అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. కానీ, వాస్తవంలో ఆ మరణాల సంఖ్య ఇంకా పెద్దగా ఉండవచ్చని విమర్శలు వస్తున్నాయి. తక్కువ ఆదాయం ఉన్న దేశాలకు తక్కువ పరిమాణంలో వ్యాక్సిన్ సరఫరా కావడం, సరఫరా అయున వ్యాక్సిన్ కూడా దాదాపు గడువు ముగిసిపోతున్న వ్యాక్సిన్ కావడం, కీలకమైన సిరంజి లు లేకపోవడం లాంటి కారణాల వల్ల ఆయా దేశాలు లక్ష్యం మేరకు ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వలేకపోయాయని చెబుతోంది డబ్ల్యుహెచ్‌వో.

Exit mobile version