ఒమిక్రాన్ వేరియంట్ కట్టడికి ఢిల్లీ ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంది. కొత్త సంవత్సరం వేడుకలపై ఇప్పటికే ఢిల్లీ సర్కార్ నిషేధం విధించింది. అంతేకాదు, నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నది. అయితే, ఢిల్లీలో పాజిటివిటీ రేటు 0.5 శాతం దాటితే ఎల్లో అలెర్ట్ విధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 50 శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే మెట్రోలు, బార్లు నడవనున్నాయి. ఇక, ప్రార్థనా మందిరాల్లోకి భక్తులను నిషేధించారు. ఒమిక్రాన్ కేసుల కారణంగా ప్రార్థనా మందిరాల్లోకి భక్తులను అనుమతించకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Read: సరికొత్త ఆవిష్కరణ: ఈ స్కూటర్‌ను మడతపెట్టి బ్యాగ్‌లో పెట్టుకోవచ్చు…
మాల్స్ విషయంలోనూ ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సరి-బేసీ పద్దతిలో మాల్స్‌కు అనుమతించాలని నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నది. రెండు వారాల క్రితం ఒమిక్రాన్ కేసులు 2 నుంచి 3 శాతం ఉండగా, ఇప్పుడు 25 నుంచి 30 శాతానికి పెరిగాయని ఢిల్లీ సర్కార్ తెలియజేసింది. ఒమిక్రాన్ కారణంగా కరోనా కేసులు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. ఒమిక్రాన్ కేసులను కట్టడి చేయకుంటే పరిస్థితులు దారుణంగా మారిపోయే అవకాశం ఉంటుందని ఢిల్లీ సర్కార్ తెలియజేసింది