కరోనా మహమ్మారి నుంచి బయటపడాలి అంటే తప్పనిసరిగా వ్యాక్సినేషన్‌తో పాటు మాస్క్ పెట్టుకోవాలని ప్రభుత్వాలు సూచించాయి. ప్రభుత్వ సూచనల మేరకు మొదటి వేవ్ సమయంలో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించారు. ఈ తరువాత వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరువాత చాలా వరకు మాస్క్ ను పక్కన పెట్టేశారు. అయితే, ఇప్పుడు ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతుండటంతో జాగ్రత్తులు తీసుకోవాలని, వ్యాక్సిన్ తీసుకున్నా మాస్క్ టప్పనిసరి అని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి.
Read: ఏలియన్స్ జాడ కోసం పూజారులతో నాసా కొత్త ప్రయత్నం…
అయితే, గతంలో కంటే వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో సాధారణ మాస్క్‌ల కంటే కాస్త మందంగా ఉండే మాస్కులు మూడు లేయర్ల మాస్కులు వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎన్ 95, ఎఫ్ఎఫ్‌పీ 2, కేఎన్ 2 మాస్కులు అయితే మంచిదని చెబుతున్నారు. మూడు లేయర్ల గుడ్డ మాస్క్ ధరించినా సరిపోతుందని అయితే, మాస్క్‌ను ధరించామంటే ధరించామని కాకుండా, ముక్కు, నోరు కవర్ అయ్యేలా ఉండాలని, అప్పుడే వైరస్ లోపలికి ఎంటర్ కాకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.