NTV Telugu Site icon

శాస్త్ర‌వేత్త‌ల‌ను క‌ల‌వ‌ర‌పెడుతున్న సూప‌ర్ స్ట్రెయిన్‌…ఆ రెండూ క‌లిస్తే…

2020లో సార్స్ కోవ్ 2 వైర‌స్ ప్ర‌పంచం మొత్తాన్ని ఇబ్బందులు పెట్టంది.  సార్స్‌కోవ్ 2 వైర‌స్ కార‌ణంగా ప్ర‌పంచంలోని చాలా దేశాల్లో లాక్‌డౌన్‌ను విధించారు.  ఆరోగ్య‌ప‌రంగా, ఆర్థికంగా ప్ర‌పంచ దేశాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి.  కాగా, ఈ ఏడాది మార్చి నుంచి డెల్టా వేరియంట్ సునామీలా దూసుకొన్ని గ‌జ‌గ‌జా వ‌ణికించింది.  కోట్లాది మంది డెల్టా వేరియంట్ బారిన ప‌డ్డారు.  ల‌క్ష‌లాది మంది మృతి చెందారు. వైర‌స్ నుంచి ర‌క్ష‌ణ పొందాలంటే వ్యాక్సిన్ తీసుకోవ‌డం ఒక్క‌టే మార్గం కావ‌డంతో వ్యాక్సినేష‌న్‌ను వేగంగా అమ‌లుచేశారు.  

Read: మరోసారి ఏజేన్సీలో పేలిన తూట.. ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి

ఆగ‌స్ట్ త‌రువాత కేసులు క్ర‌మంగా త‌గ్గ‌డం మొద‌లుపెట్టాయి.  హమ్మ‌య్యా అని ఊపిరి పీల్చుకునేలోగా క‌రోనా రూపం మార్చుకొని, బ‌లం పెంచుకొని ఒమిక్రాన్ రూపంలో ఎటాక్ చేసింది.  ఈ ఒమిక్రాన్ దెబ్బ‌కు దేశాలు అతలాకుత‌లం అవుతున్నాయి.  రోజురోజుకు ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి.  అయితే, డెల్టా నుంచి ప్ర‌పంచం పూర్తిగా కోలుకోలేదు.  ఈలోగా ఒమిక్రాన్ కేసులు విజృంభిస్తున్నాయి.  ఒక‌వేళ ఒకే వ్య‌క్తికి డెల్టా, ఒమిక్రాన్ రెండే వేరియంట్లు సోకితే ప‌రిస్థితి మ‌రింత దారుణంగా మారే అవ‌కాశం ఉంద‌ని, సూప‌ర్ స్ట్రెయిన్లు అభివృద్ది చెందుతాయ‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.  సూప‌ర్ స్ట్రెయిన్లు ఒమిక్రాన్ డెల్టా కంటే 30 రెట్లు అధికంగా స్పైక్ ప్రోటీన్‌ను క‌లిగి ఉంటుంద‌ని, సూప‌ర్ స్ట్రెయిన్లు ఏర్ప‌డితే వాటికి అడ్డుక‌ట్ట వేయ‌డం చాలా క‌ష్టమ‌ని మోడెర్నా చీఫ్ మెడిక‌ల్ ఆఫీస‌ర్ పాల్ బ‌ర్ట‌న్ పేర్కొన్నారు.