మొన్నటి వరకు ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతుండడంతో దేశవ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య భారీగా నమోదైంది. అయితే ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు కోవిడ్ నిబంధనలు కఠినతరం చేయడమే కాకుండా.. నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్‌డౌన్‌లు విధించాయి. దీంతో గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 34,113 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. భారతదేశంలో ఇప్పటివరకు మొత్తం 75.18…
2020లో సార్స్ కోవ్ 2 వైరస్ ప్రపంచం మొత్తాన్ని ఇబ్బందులు పెట్టంది. సార్స్‌కోవ్ 2 వైరస్ కారణంగా ప్రపంచంలోని చాలా దేశాల్లో లాక్‌డౌన్‌ను విధించారు. ఆరోగ్యపరంగా, ఆర్థికంగా ప్రపంచ దేశాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. కాగా, ఈ ఏడాది మార్చి నుంచి డెల్టా వేరియంట్ సునామీలా దూసుకొన్ని గజగజా వణికించింది. కోట్లాది మంది డెల్టా వేరియంట్ బారిన పడ్డారు. లక్షలాది మంది మృతి చెందారు. వైరస్ నుంచి రక్షణ పొందాలంటే వ్యాక్సిన్ తీసుకోవడం ఒక్కటే మార్గం కావడంతో వ్యాక్సినేషన్‌ను…
ప్రపంచ వ్యాప్తంగా ఓమిక్రాన్ వైరస్ వేగంగా విస్తరిస్తుంది. తాజాగా ఆస్ట్రేలియాలోని సిడ్నీకి వెళ్లిన ఇద్దరు విదేశీ ప్రయాణికులకు కరోనావైరస్ పరీక్షలు చేశారు. కాగా వారికి కొత్త ఓమిక్రాన్ వేరియంట్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ఆస్ట్రేలియా అధికారులు ఆదివారం ధృవీకరించారు. శనివారం దక్షిణాఫ్రికా నుంచి ఆస్ట్రేలియాకు వచ్చిన మరో 14 మంది బృందంలో ఈ ఇద్దరు ప్రయాణికులు ఉన్నారు. వారికి కోవిడ్ -19 టీకాలు వేసినట్టు అధికారులు తెలిపారు. కాగా మిగిలిన 12 మందిని క్వారంటైన్‌లో ఉంచారు. కొత్త…
దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్తరకం వేరియంట్ ‘ఒమిక్రాన్’ ఇప్పటికే ప్రపంచాన్ని చుట్టేస్తోంది. ఆఫ్రికాలోని పలు దేశాలకు ఇప్పటికే విస్తరించిన ఈ వేరియంట్.. క్రమంగా మిగతా చోట్లకు విస్తరిస్తోంది. తాజాగా జర్మనీలో ఒకరు ఒమిక్రాన్ బారిన పడగా.. బ్రిటన్‌లో రెండు కేసులు నిర్ధారణ అయ్యాయి. B.1.1529 వేరియంట్ బోట్స్‌వానా, బెల్జియం, ఇజ్రాయెల్, హాంకాంగ్‌లకు వ్యాపించింది. ఒమిక్రాన్ వైరస్ కొన్ని దేశాల్లో మాత్రమే వ్యాపిస్తుందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఈమేరకు ప్రజలకు కొన్ని సూచనలు చేసింది. ఒమిక్రాన్ వైరస్‌తో అప్రమత్తంగా…