మెట్రో రైళ్లు అన్ని వేళల్లోనూ కిటకిటలాడుతాయి. అయితే స్టేషన్లలో కొందరు యువతీయువకులు చేసే అతిచేష్టలు అప్పుడప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి. రైలు స్టేషన్‌లోకి వచ్చేటప్పుడు సెల్ఫీలు తీసుకోవడం, మెట్రో స్టేషన్లో సినిమా పాటలకు డ్యాన్సులు చేస్తూ కొందరు నిబంధనలు మీరుతున్నారు. తాజాగా ఢిల్లీ మెట్రో రైల్వే స్టేషన్ లో ఓ యువతి చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read:Ambati Rambabu: పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై క్లారిటీ ఇచ్చిన ఇరిగేషన్ మంత్రి
ఈ మధ్య ఢిల్లీ మెట్రో తరుచూ వార్తల్లో నిలుస్తోంది. కేవలం బ్రా, మిన్ స్కర్ట్ ధరించిన ఒక అమ్మాయి కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణిస్తున్నట్లు కనిపించడంతో ఢిల్లీ మెట్రో కొంతకాలంగా చర్చనీయాంశమైంది. తాజాగా ఇప్పుడు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫాంపై ఓ మహిళ చీర కట్టుకుని డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది.అవని కరిష్‌గా అనే మహిళ తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో వీడియోను షేర్ చేసింది. ఆమె ఖేసరీ లాల్ యాదవ్, ప్రియాంక సింగ్‌ల ప్రసిద్ధ భోజ్‌పురి పాట సాజ్ కే సావర్ కేకి డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఈ వీడియో వేల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. యువతి డ్యాన్స్ వీడియోపై నెటిజన్లు పలు రకాలుగా స్పందించారు.
Also Read: Juniour Judge Suspend : జూనియర్ సివిల్ జడ్జిని సస్పెండ్ చేసిన తెలంగాణ హైకోర్టు
మెట్రో ప్రాంగణంలో ఎలాంటి ఫోటో లేదా వీడియోగ్రఫీని DMRC ఎలా నిషేధించిందని కొందరు కామెంట్లు చేస్తే… మరికొందరు CISF అటువంటి వీడియోలను ఆపడానికి చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానించారు. అయితే కొందరు మహిళ ధైర్యాన్ని మెచ్చుకున్నారు. అయితే, అవనికరిష్ ఢిల్లీ మెట్రోలో డ్యాన్స్ చేయడం ఇది మొదటిసారి కాదు. అక్కడ ఆమె సోను నిగమ్, అల్కా యాగ్నిక్‌ల బిండియా చమ్కే చూడీ ఖాంకే పాటకు డ్యాన్స్ చేసింది. ఆమె మార్చిలో డ్యాన్స్ క్లిప్‌ను షేర్ చేసింది.