1 ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉత్తర ప్రదేశ్‌పై ప్రధాని మోదీ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో మంగళవారం నాడు యూపీలోని ప్రయాగ్ రాజ్‌లో ప్రధాని మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా స్వయం సహాయక మహిళా సంఘాల ఖాతాలకు రూ.వెయ్యి కోట్లను ప్రధాని మోదీ బదిలీ చేశారు.
2 హుజూరాబాద్ ఎన్నికల్లో ఓటమి అనంతరం.. రెండు రోజుల తర్వాత సీఎం కేసీఆర్ ఈ ధాన్యం కొనుగోలు అంశాన్ని లేవనేత్తారని… అంతకు ముందు ఈ విషయం తెలియదా అంటూ ప్రశ్నించారు. సీఎం తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని విమర్శించారు. సీఎం మెడమీద కత్తి పెట్టి రాయించున్నారని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
3 ములుగు జిల్లాలో ఓ మాజీ సర్పంచ్ ని కిడ్నాప్ చేశారు మావోయిస్టులు. దీంతో కలకలం రేగింది. వెంకటాపురం మండలం సూరవీడు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కురుసం రమేష్ ని మావోయిస్టులు అపహరించుకుపోయారు.
4తెలంగాణలో ఇంటర్ ఫలితాలతో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయి. ఇంటర్ ఫస్టియర్‌లో 49 శాతం పాస్ కావడంతో విద్యార్థులు ఇంటర్ బోర్డు ముందు ఆందోళనలు చేస్తున్న సంగతి తెల్సిందే. ఇప్పటికే విద్యార్థి సంఘాలు జూనియర్ కాలేజీల బంద్‌ను సైతం నిర్వహించాయి. దీంతో ప్రతిరోజు ఇంటర్ బోర్డు ముందు ఆందోళనలకు దిగుతున్నారు. అటు జిల్లాల్లో సైతం ఇదేపరిస్థితి నెలకొంది.
5పవన్ అభిమానులందరినీ నిరాశ పరుస్తూ భీమ్లా నాయక్ వెనుకంజ వేసింది. ఇప్పటివరకు తగ్గేదేలే అన్న నిర్మాత సూర్యదేవర నాగ వంశీ సైతం తన హీరో మాట విని వెనక్కి తగ్గినట్లు తెలుపుతూ అధికారికంగా తెలిపారు. ఇకపోతే పవన్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ హస్తం ఉందని అంటున్నారు పలువురు నెటిజన్లు. ఆయనే దగ్గరుండి ఈ సినిమాను వాయిదా వేయించినట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
6.తెలంగాణలో కొత్త జోనల్ విధానం ప్రకారం పోస్టుల విభజన కొందరికీ వరంగా, మరికొందరికి శాపంగా మారింది. ఇదే అదునుగా కొందరు అధికారులు పారదర్శకతకు పాతరేస్తూ అయిన వారిని అందలం ఎక్కిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీనియార్టీ పేరుతో కొందరికే పట్టం కడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
7 సినిమా విడుదలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ఎక్కడ చూసినా ‘శ్యామ్ సింగ రాయ్’ సందడే కన్పిస్తోంది. వరుస ఇంటర్వ్యూలతో పాటు పలు ఈవెంట్లలో పాల్గొంటూ సినిమాపై ఆసక్తిని పెంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘శ్యామ్ సింగ రాయ్’టీంని ఇబ్బంది పెట్టే ప్రశ్న అడిగింది ఓ యాంకర్. వెంటనే సాయి పల్లవి అందుకుని స్మైల్ ఇస్తూనే ఆమె ప్రశ్నకు కౌంటర్ ఇవ్వడంపై ఆమె అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.
8మహిళాల వివాహా వయస్సును 18 నుంచి21 ఏళ్లకు పెంచేందుకు ఉద్దేశించిన చట్ట సవరణకు సంబంధించిన , బాల్య వివాహా సవరణ బిల్లును కేంద్రమంత్రి స్మృతి ఇరానీ లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఇప్పటికే ఈ బిల్లు పై పలు విమర్శలు వస్తున్నాయి. మహిళల స్వేచ్ఛను హరించడమేనని ప్రతి పక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే ఉన్న వివాహా వయస్సును తగ్గించి పెంచడం మంచిది కాదని విపక్షాలు అంటున్నాయి.
9ప్రపంచంలోనే అత్యంత పెద్ద క్రూజ్ షిప్పుగా పేరుగాంచిన ది రాయల్ కరేబియన్ సింఫనీ ఆఫ్ సీస్ ఇప్పుడు కరోనా క్లస్టర్‌గా మారిపోయింది. ఈ షిప్పులో 6 వేల మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తుండగా అందులో ఒకరు అనారోగ్యం బారిన పడ్డారు. షిప్పులోనే ఆమెకు టెస్టులు చేయగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ జరిగింది. వెంటనే ఆమెతో కాంటాక్ట్‌లో ఉన్న వారికి టెస్టులు నిర్వహించారు.
10 అనగనగా ఓ బిచ్చగాడు. వీధులెంట, ఇళ్లవెంట తిరిగి భిక్షమెత్తుకొని చాలా డబ్బు సంపాదించాడు. అలా సంపాదించిన డబ్బును ఓరోజు ఉజ్జయిని లోని నాగదా రైల్వే స్టేషన్ బయట మెట్లపై కూర్చోని సంచిలో నుంచి డబ్బులు తీసి బయటకు విసరడం ప్రారంభించాడు. బిచ్చగాడు చేసిన పనికి అక్కడున్న ప్రయాణికులంతా షాక్ అయ్యారు.
