1.యూపీలో రాజకీయ వేడి రాజుకుంది. త్వరలో జరగబోయే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీజేపీ. మళ్ళీ అధికారమే పరమావధిగా అడుగులు వేస్తోంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ అయోధ్య నుంచి పోటీచేయనున్నారా..? ఇంతకూ యోగీని అయోధ్యనుంచే పోటీకి దించాలని బీజేపీ నేతలు ఎందుకు భావిస్తున్నారు…? యోగీ, అయోధ్య స్థానానికి మారడం.. సార్వత్రిక ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపనుంది.?అనేది యావత్ భారతాన చర్చనీయాంశంగా మారింది.
2.ఏపీలో ఉద్యోగసంఘాలు ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నాయా? అంటే అవుననే అనిపిస్తోంది. సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలు క్యాంప్ కార్యాలయానికి రానున్నారు. పీఆర్సీ, హెచ్ఆర్ఏ, సీసీఏ రద్దును వ్యతిరేకిస్తున్నారు సచివాలయ ఉద్యోగులు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా సహకరించాలని కోరుతోంది ప్రభుత్వం. జీవోలు వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో ఆందోళన బాటలో వెళతాం అంటున్నారు ఉద్యోగ సంఘాలు.
3. ఏపీలో మద్యం అమ్మకాల సమయం పెంచడంపై విపక్షాలు వ్యంగ్యాస్త్రాలు, విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. సమయాన్ని పెంపుదల చేయడంపై బీజేపీ ఆక్షేపిస్తోంది.కేసినో వ్యవహారంలో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. తెలుగు సంస్కృతిని దెబ్బ తీసేందుకే వైసిపి కంకణం కట్టుకుంది.గుడివాడలోని కె .కన్వెంక్షన్ హాలులో కేసినో వ్యవహారమే తెలుగు సంస్క్రుతిని దెబ్బ తీసే చర్యల్లో భాగమే అన్నారు బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు.
4.తెలంగాణ సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల ప్రాణాలు ముఖ్యమంత్రి కేసీఆర్ లెక్క లేదు- అందుకే మోడీ వీడియో కాన్ఫిరెన్సు కు హాజరు కాలేదన్నారు. కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అమలు చేస్తే పేదలకు 25శాతం అడ్మిషన్లు ఫ్రీ వస్తుంది. యాక్ట్ గురించి అడిగితే కేజీ టు పీజీ ఇస్తున్నాం అని కేసీఆర్ అంటాడు. అసలు టీచర్ల నోటిఫికేషన్ ముఖ్యమంత్రి ఎందుకు ఇవ్వడం లేదు?
5.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని క్లబ్‌లల్లో, సినిమా హాళ్లలో, షాపింగ్ మాల్స్‌లలో తనిఖీలు చేస్తున్నట్లు తెలంగాణ సెంట్రల్ రీజినల్ అగ్నిమాపక శాఖ ఆఫీసర్ పాపయ్య వెల్లడించారు. సికింద్రాబాద్ క్లబ్ అగ్నిప్రమాదం ఘటన తర్వాత హైదరాబాద్‌లోని అన్ని క్లబ్‌లలో తనిఖీలు చేపడుతున్నామని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 25కు పైగా క్లబ్ లు ఉన్నాయని, నిన్న 17 క్లబ్‌లల్లో తనిఖీలు నిర్వహించామన్నారు.
6.హన్మకొండ, భూపాలపల్లి జిల్లాల్లో మంత్రి నిరంజన్‌రెడ్డి పర్యటించారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను నిరంజన్‌రెడ్డి పరిశీలించారు. పరకాల, నడికూడ, రేగొండ మండలాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. నిరంజన్ రెడ్డి వెంట మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఉన్నతాధికారులు ఉన్నారు. వర్షాలతో నష్టపోయిన రైతులతో నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు లు మాట్లాడారు. రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలను మంత్రులు తెలుసుకున్నారు.
7.ములుగు కర్రిగుట్ట ఎన్‌కౌంటర్‌లో గాయపడ్డ జవాన్‌ను హైదరాబాద్‌కు తరలించారు. ప్రత్యేక ఆర్మీ హెలికాప్టర్‌లో బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న జవాన్ మధు. అక్కడి నుంచి ప్రత్యేక అంబులెన్స్‌లో సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న వైద్యులు. గ్రేహౌండ్స్ జవాన్ మధును కలిసేందుకు భారీ స్థాయిలో యశోద ఆస్పత్రికి చేరుకుంటున్న పోలీసు అధికారులు.
8.సూపర్ టీసర్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా, నిధి అగర్వాల్ జంటగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హీరో’. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోంది. ఈ సినిమాపై సూపర్ స్టార్ మహేష్ బాబుతో సహా పలువురు ప్రముఖులు తమ స్పందన తెలియజేస్తున్నారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో సినిమాపై తన స్పందన తెలియజేశాడు.
9.ఉగాండాలో ఓ తెలుగు అమ్మాయి చిన్నతనంలో కీర్తిప్రతిష్టలు సంపాదించుకుంటోంది. చదివేది 9వ తరగతి అయినా ఉగాండా అధ్యక్షుడి చేత ప్రశంసలు అందుకుంది. వివరాల్లోకి వెళ్తే.. 14 ఏళ్ల వయసున్న తెలుగు అమ్మాయి గొల్లపల్లి ప్రజ్ఞశ్రీ ఉగాండాలోని ఢిల్లీ పబ్లిక్ స్కూలులో విద్యను అభ్యసిస్తోంది. అయితే ఆ అమ్మాయికి వివిధ దేశాలు తిరగాలంటే చాలా ఇష్టం. అంతేకాకుండా ఆమె ఆహార ప్రియురాలు. అటు క్రీడల్లోనూ ప్రజ్ఞశ్రీ ప్రతిభను చాటుతోంది. ఫుట్‌బాల్, బాస్కెట్ బాల్ వంటి ఔట్ డోర్ గేమ్స్‌తో పాటు చెస్, క్యారమ్స్ వంటి ఇండోర్ గేమ్స్‌లోనూ తన ప్రావీణ్యం చూపుతోంది.
10. సాయిధరమ్ తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ చిత్రం గత యేడాది అక్టోబర్ 1వ తేదీ జనం ముందుకు వచ్చింది. గాంధీ జయంతిని పురస్కరించుకుని చిత్ర నిర్మాతలు ఆ చిత్రాన్ని ఆ రోజున విడుదల చేశారు. భారత రాజకీయ వ్యవస్థతో ఓ ఐ.ఎ.ఎస్. అధికారి తలపడితే ఎలాంటి పర్యావసానం ఎదుర్కోవాల్సి వచ్చిందనేది ప్రధానాంశంగా దేవ కట్టా ‘రిపబ్లిక్’ చిత్రం తెరకెక్కించాడు.
