ఆగస్టు 18, బుధవారం దినఫలాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం : ఈ రోజు ఈ రాశివారికి ఆర్థిక ఇబ్బందులు లేకపోయినా సంతృప్తికానరాదు. అధిక ఉష్ణం వల్ల కుటుంబ పెద్దల పట్ల ఆందోళన చెందుతారు. చిన్నతరహా పరిశ్రమలలో వారికి అనుకూలత. సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.
వృషభం : ఈరోజు ఈ రాశిలోని వస్త్ర, బంగారు, వెండి వ్యాపారస్థులకు జయం చేకూరగలదు. వృత్తుల వారికి సంఘంలో మంచి గుర్తింపు. శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది. కొన్ని అనుకోని సంఘటనలు మనస్తాపం కలిగిస్తాయి. ముఖ్యుల కోసం మీ పనులు వాయిదా వేసుకోవలసి వస్తుంది.
Also Read
మిథునం : ఈ రోజు ఆదాయ వ్యయాల్లో ఈ రాశివారి అంచనాలు తలకిందులవుతాయి. ప్రముఖుల కలయిక వల్ల ఏమాత్రం ఫలితం ఉండదు. స్త్రీల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు నిర్మాణ పనుల్లో ఏకాగ్రత ముఖ్యం.
కర్కాటకం : ఈ రోజు మీ గృహమునకు కావాల్సిన వస్తువులు అమర్చుకుంటారు. విద్యార్థులకు హడావుడి తొందరపాటుతగదు. కీలకమైన సమావేశాల్లో మితంగానే సంభాషించండి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.
సింహం : ఈ రోజు మీరు చేయదలుచుకున్న మంచి పని వాయిదా వేయకండి. మీ సంతానం కోసం ఫీజులు బిల్లులు చెల్లిస్తారు. బంధు మిత్రుల నుంచి ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. విద్యార్థులకు ఇంజనీరింగ్, మెడికల్ కోర్సులలో ప్రవేశం లభిస్తుంది.
కన్య : ఈ రోజు ఈరాశిలోని ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి పేరు ఖ్యాతి లభిస్తుంది. లౌక్యంగా వ్యవహరించి మీ పనులు చక్కబెట్టవలసి వస్తుంది. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులను ఎదుర్కొంటారు. వైద్యులు అరుదైన ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేస్తారు.
తుల : ఈ రోజు కొంతమంది మీ పలుకుబడి ద్వారా లబ్ధి పొందుతారు. క్యాటరింగ్ పనివారలకు సదావకాశాలు లభిస్తాయి. విదేశీయానం కోసం చేస్తున్న యత్నాలు ఫలిస్తాయి. ఏదైనా స్థిరాస్తి కొనుగోలు లేక అభివృద్ధి చేయాలనే మీ ఆలోచనలుంటాయి.
వృశ్చికం : ఈ రోజు ఈ రాశిలోని స్త్రీలు, టీవీ చానెళ్ల కార్యక్రమాల్లో రాణిస్తారు. ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. మనోధైర్యంతో యత్నాలు సాగించాల్సి ఉంటుంది. స్థిరాస్తి క్రయ విక్రయం విషయంలో మంచి లాభం ఉంటుంది.
ధనస్సు : ఈ రోజు ఉద్యోగస్తులు పై అధికారులతో సంభాషించునపుడు కాస్త జాగ్రత్త అవసరం. వాహన చోదకులు జరిమానాలు చెల్లించవలసి వస్తుంది. ఉమ్మడి, సొంత వ్యాపారాల అభివృద్ధికి బాగా శ్రమిస్తారు. కుటుంబీకుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి.
మకరం : ఈ రోజు మీ గృహమునకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఖర్చులు ఊహించినవే కావడంతో ఇబ్బందులంతగా ఉండవు. ప్రముఖుల సిఫార్సుతో నిరుద్యోగులకు మంచి అవకాశం లభిస్తుంది. మీ శ్రీమతి సలహా పాటించడం వల్ల అన్ని విధాలా శ్రేయస్కరం. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
కుంభం : ఈ రోజు పుణ్యక్షేత్ర సందర్శనలు ఉల్లాసం కలిగిస్తాయి. ధనం ఏమాత్రం నిల్వ చేయలేకపోతారు. మీ వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులెదుర్కొంటారు. వృథా ఖర్చులు అధికంగా ఉంటాయి.
మీనం : ఈ రోజు రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. స్త్రీలకు పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి. పాత మిత్రుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. నిరుద్యోగులు రాత మౌఖిక పరీక్షల్లో విజయం సాధిస్తారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!