కరోనా కట్టడి కోసం రకరకాల చర్యలకు పూనుకున్నాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు.. ఇందులో భాగంగా కర్ఫ్యూ విధించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… కేసుల తీవ్రతను బట్టి.. కర్ఫ్యూ విధించిన సర్కార్.. ఆ తర్వాత కేసులు తగ్గుముఖం పట్టడంతో.. నైట్ కర్ఫ్యూకు వెళ్లిపోయింది.. అయితే, తాజాగా మరో వారం రోజుల పాటు ఏపీలో రాత్రి పూట కర్ఫ్యూ పొడిగించింది సర్కార్… రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది ఆంధ్రప్రదేశ్ సర్కార్.. దీంతో.. ఈ నెల 21వ తేదీ వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. కాగా, కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టడంతో… రేపటి నుంచి స్కూళ్లు రీఓపెన్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైన సంగతి తెలిసిందే.