టీ20 ప్రపంచకప్‌లో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ టీమిండియా టాస్ ఓడిపోయింది. కాసేపట్లో భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ జరగనుండగా… ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ విలియమ్సన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పాకిస్థాన్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లోనూ కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్‌ను ఓడిపోయాడు. ఆ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. మరి ఈ మ్యాచ్‌లో ఫలితం ఎలా ఉంటుందో వేచి చూడాలి. కాగా ఈ మ్యాచ్‌లో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. భువనేశ్వర్ స్థానంలో శార్దూల్ ఠాకూర్, సూర్యకుమార్ యాదవ్ స్థానంలో ఇషాన్ కిషన్ తుది జట్టులోకి వచ్చారు.
తుది జట్లు:
భారత్-రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, హార్డిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా
న్యూజిలాండ్-మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, విలియమ్సన్, కాన్వే, ఫిలిప్స్, నీషమ్, శాంట్నర్, సౌథీ, ఆడమ్ మిల్నే, ఇష్ సోథీ, బౌల్ట్