NTV Telugu Site icon

Ajit Pawar: బిజెపిలోకి అజిత్ పవార్?…. ఎన్సీపీ నేత మనసులో మాట ఏంటి?

Ajit Pawar

Ajit Pawar

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) నాయకుడు అజిత్ పవార్ తన మద్దతుదారులతో బిజెపిలోకి వెళ్తున్నారన్న ప్రచారం మహారాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. అజిత్ కు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలతో షిండే- ఫడ్నవీస్ ప్రభుత్వంతో చేతులు కలపాలని భావిస్తున్నట్లు రాజకీయవర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్సీపీ నేత అజిత్ పవార్ స్పందించారు. తాను బీజేపీతో కలుస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని అజిత్ పవార్ ఖండించారు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న పుకార్లలతో ఎలాంటి నింజ లేదని ఆయన తెలిపారు. ”నేను ఎన్‌సిపితో ఉన్నానని, మరియు నేను ఎన్‌సిపితోనే ఉంటాను ”అని అజిత్ పవార్ వ్యాఖ్యానించారు.

మహారాష్ట్ర ప్రతిపక్ష కూటమిలో చీలిక జరిగిందన్న ప్రచారంతో ఎన్‌సిపి కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారని అజిత్ పవార్ పేర్కొన్నారు. కార్యకర్తలు చింతించకండి అని సూచించారు. శరద్ పవార్ నాయకత్వంలో ఎన్‌సిపి ఏర్పడిందని, తాము అధికారంలో , ప్రతిపక్షంలో ఉన్న సందర్భాలు ఉన్న సందర్భాలు ఉన్నాయని ఆయన గుర్తుచేశారు.
Also Read:Miss India World Nandita Gupta: అందగత్తె మాట!

మరోవైపు గతేడాది శివసేనను చీల్చి ఏకంగా ఏక్ నాథ్ షిండే బీజేపీ సహకారంలో సీఎం అయ్యారు. ఈ రాజకీయ వేడి చల్లారకముందు ఎన్సీపీ నేత అజిత్ పవార్, సీనియర్ లీడర్ శరద్ పవార్ కు షాకిచ్చేలా కనిపిస్తోంది. ఆయన బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా సమచారం. అజిత్ పవార్ కు మద్దతుగా మెజారిటీ ఎమ్మెల్యేలు మద్దతు నిలిచినట్లు సమాచారం. ఎన్సీపీ పార్టీకి చెందిన 53 మంది ఎమ్మెల్యేల్లో 34 మంది అజిత్ పవార్ కు మద్దతుగా బీజేపీతో చేతులు కలిపాలని, షిండే-ఫడ్నవీస్ ప్రభుత్వంలో భాగం కవాలని కోరుతున్నట్లు తెలుస్తోంది.