మహారాష్ట్ర రాజకీయాలు ఆసక్తికంగా మారాయి. ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ బీజేపీతో కలుస్తారన్న ప్రచారంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. తన మద్దతుదారులతో బీజేపీలో చేరేందుకు అజిత్ పవార్ చర్చలు జరుపుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) నాయకుడు అజిత్ పవార్ తన మద్దతుదారులతో బిజెపిలోకి వెళ్తున్నారన్న ప్రచారం మహారాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. అజిత్ కు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలతో షిండే- ఫడ్నవీస్ ప్రభుత్వంతో చేతులు కలపాలని భావిస్తున్నట్లు రాజకీయవర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.